AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొంగల నుంచి బంగారం కొట్టేసి అడ్డంగా బుక్కైన పోలీసులు! ఇది మామూలు ట్విస్ట్‌ కాదు..

చిత్తూరు జిల్లాలోని కట్టమంచిలో జరిగిన రూ.12 లక్షల బంగారం దొంగతనం కేసులో పోలీసులు రూ.6 లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు చూపించారు. అసలు దొంగతనం చేసిన వ్యక్తి రాయచోటిలో మరో దొంగతనం చేసినట్లు తెలియడంతో, రాయచోటి పోలీసులు చిత్తూరు పోలీసులపై కేసు నమోదు చేయాలని హెచ్చరించారు. పోలీసుల అవినీతిపై విచారణ జరుగుతోంది.

దొంగల నుంచి బంగారం కొట్టేసి అడ్డంగా బుక్కైన పోలీసులు! ఇది మామూలు ట్విస్ట్‌ కాదు..
Police
Raju M P R
| Edited By: |

Updated on: Mar 20, 2025 | 1:18 PM

Share

చిత్తూరు జిల్లాలో దొంగ సొమ్ము కొట్టేసిన పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. పక్క జిల్లా పోలీసులు కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో ఆవాక్కయ్యారు. గతేడాది సెప్టెంబర్ లో చిత్తూరులో జరిగిన ఒక దొంగతనం కేసు ఇప్పుడు చిత్తూరు పోలీసుల మెడకు చుట్టుకుంది. చిత్తూరు కట్టమంచిలో సెప్టెంబర్ 30న ఒక ఇంట్లో రూ.12 లక్షల విలువైన బంగారు నగలను దొంగలు దోచుకెళ్లినట్లు కేసు నమోదు అయ్యింది. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వన్ టౌన్ పోలీసులు కేసును చేదించేందుకు ఒక టీం గా ఏర్పడ్డారు. దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. రాయచోటి ప్రాంతానికి చెందిన దొంగను విచారించిన సీఐ, ఎస్సై మరో ముగ్గురు కానిస్టేబుల్ టీం ఎక్వయిరీ సమయంలో దొంగ నేర చరిత్రను తెలుసుకొని రికవరీకి ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగానే కట్టమంచిలో దోపిడీ చేసిన సొమ్మును బెంగళూరులో అమ్మినట్లు గుర్తించిన పోలీసులు దొంగతోపాటు అక్కడికి వెళ్లి ఆరా తీశారు. అయితే తాను ఎలాంటి దొంగ సొమ్ము కోనలేదని షాపు యజమాని అడ్డం తిరగడంతో పోలీసులు రికవరీ చేయలేకపోయారు. దొంగలించిన సొమ్ము షాప్ యజమాని నుంచి రాబట్ట లేకపోయిన చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు ప్రాపర్టీ రికవరీ కోసం దొంగ పై ఒత్తిడి పెంచారు. దీంతో దొంగ చిత్తూరులో చేసిన హౌస్ రాబడి కంటే ముందు రాయచోటిలోనూ ఒక ఇంటిలో దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. అక్కడ భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లు తెలుసుకొని రికవరీకి ప్రయత్నం చేశారు. దొంగ తనం చేసిన బంగారు ఎట్టకేలకు పోలీసుల చేతికి చేరింది. దాదాపు రూ.12 లక్షల మేర సొమ్మును రికవరీ చేసిన పోలీసులు రూ.6 లక్షల సొమ్ము ను మాత్రమే రికవరీ చూపి కట్టమంచి ఇంటి దొంగతనం కథ ముగించేశారు.

అయితే ఆ తర్వాత రాయచోటి పోలీసులకు దొరికిపోయిన దొంగ నుంచి వివరాలు రాబట్టిన అన్నమయ్య జిల్లా పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఖంగు తిన్నారు. రాయచోటిలో హౌస్ రాబరీ కి పాల్పడిన సొత్తును చిత్తూరు పోలీసులు రికవరీ చేశారని దొంగ నుంచి సమాచారం సేకరించారు. ఈ మేరకు రికవరికి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే చిత్తూరు వన్ టౌన్ పోలీసులను రాయచోటి పోలీసులు సంప్రదించారు. అయితే రాయచోటి దొంగ నుంచి అదనంగా బంగారు ను స్వాధీనం చేసుకోలేదని బుకాయించడంతో వ్యవహారం అడ్డం తిరిగింది.

చిత్తూరు, రాయచోటి పోలీసుల మధ్య వివాదంగా మారింది. రాయచోటి దొంగతనం కేసు లోని దొంగ ద్వారా బంగారును కాజేసి అందులోని సగం సొత్తు మాత్రమే చిత్తూరు చోరీ కేసులో రికవరీ చూపిన పోలీసుల వ్యవహారం చర్చకు వచ్చింది. రాయచోటి దొంగ మంచి రికవరీ చేసిన బంగారు ఇవ్వకపోతే కేసు పెడతామంటూ చిత్తూరు పోలీసులకు రాయచోటి పోలీసుల నుంచి వార్నింగ్ కూడా వచ్చింది. ఈ విషయం కాస్త చిత్తూరు జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఎట్టకేలకు అసలేం జరిగిందన్న దానిపై విచారణకు ఆదేశించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా దొంగ సొమ్ము వ్యవహారం ఇప్పుడు రెండు జిల్లాల పోలీసుల మధ్య సమస్యగా మారగా అంతటా చర్చ కూడా నడుస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.