CM Jagan-Chiranjeevi: ఏపీ సర్కార్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపు.. ఎందుకంటే..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి పేర్ని నాని డైరెక్ట్‌గా...
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి పిలుపు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి పేర్ని నాని డైరెక్ట్‌గా చిరంజీవికి కాల్ చేశారు. సినీ పెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత ఇండస్ట్రీ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. గతంలోనూ సినీ రంగం సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి పేర్ని నాని చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ పిలుపు మేరకు ఈ నెల చివరి వారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీకి చిరు టీమ్ రెడీ అవుతుంది.
కాగా గత ఏడాది కూడా చిరంజీవి, నాగార్జున, ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, సి కళ్యాణ్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఇతర టాలీవుడ్ ప్రముఖులు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. ఏపీ సర్కారు నుంచి సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాల గురించి చర్చించారు. అప్పట్లో మంత్రి పేర్ని నాని, వైసిపి నేత ప్రముఖ సినీ నిర్మాత అయిన పొట్లూరి వర ప్రసాద్ కూడా ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన కారణంగా షూటింగ్స్ లేక సినీ కార్మికులు, నటులు పడిన కష్టాలు..థియేటర్ల సమస్యలు, మినిమం ఫిక్స్డ్ ఛార్జ్‌లు గురించి అప్పట్లో సినీ ప్రముఖులు సీఎంతో చర్చించారు. అప్పటి సమావేశం అనంతరం బయట మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. తమ వినతులన్నింటినీ పరిశీలిస్తాం అని ముఖ్యమంత్రి జగన్ బదులిచ్చినట్టుగా తెలిపారు.
కాగా వ్యక్తిగతంగా కూడా చిరుకు, ఏపీ సీఎం జగన్‌కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో సతీసమేతంగా చిరు వెళ్లి.. సీఎం జగన్ దంపతులను సత్కరించారు కూడా. అనంతరం ఇరువురు పుట్టినరోజులు సహా పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా విష్ చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను చిరు ట్విట్టర్‌లో ప్రశంసించారు.
Also Read:“ఇది రాయల్ ఎంట్రీ అంటే”.. భయ్యా.. నువ్వు చింపేశావ్ పో’