Viral Video: “ఇది రాయల్ ఎంట్రీ అంటే”.. భయ్యా.. నువ్వు చింపేశావ్ పో

పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు, ఆసక్తికరమైన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి...

Viral Video: ఇది రాయల్ ఎంట్రీ అంటే.. భయ్యా.. నువ్వు చింపేశావ్ పో
Groom Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 14, 2021 | 7:22 PM

పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక ఫన్నీ వీడియోలు, ఆసక్తికరమైన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఖతర్నాక్ ట్రెండింగ్ వీడియోను మీ ముందుకు పట్టుకొచ్చాం. పెళ్లి మండపానికి గుర్రం, బైక్, లగ్జరీ కారు, ఆఖరికి స్పెషల్ చాపర్‌లో వచ్చినవారిని మనం ఇప్పటివరకూ చూసి ఉంటాం. ఇదంతా ఓల్డ్ ట్రెండ్ అండి బాబూ. తాజాగా ఒక క్రేజీ వరుడ్ని మీకు పరిచయం చేయబోతున్నాం. అవును ఇతగాడు మాస్ స్టైల్లో వివాహ వేదికకు చేరుకున్నాడు. ఒక ఫ్రెండ్ భుజంపై ఎక్కించుకుని వరుడ్ని తీసుకొస్తూ ఉండగా.. మిగిలిన దోస్తులు, గ్రామంలోని పిల్లలు తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపారు. ఇది చూసి కొందరు నవ్వుతుండగా, మరికొందరు మాత్రం నీ రూటే సెపరేట్ గురూ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే, ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ షూట్ చేశారు..? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు.

ముందుగా వీడియో వీక్షించండి

వీడియోలో వరుడు తన స్నేహితుడి భుజంపై కూర్చుని వివాహ వేదిక వద్దకు వెళ్లడాన్ని మీరు చూడవచ్చు. అదే సమయంలో, ఆ గ్రామంలోని పిల్లలు ఉత్సాహంతో నృత్యం చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. షేర్లు చేయడమే కాదు.. తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో తెలియజేస్తున్నారు. “ఇది లాక్‌డౌన్‌ వివాహం “అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. ” అద్దెకు తెచ్చుకునే బండ్లలో వస్తే ఏముంది బ్రో.. దోస్తులతో ఇలా వస్తేనే మెమోరీస్ ఉంటాయ్” అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.  ఈ ఫన్నీ వీడియో నిరంజన్ మోహపాత్రా అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

Also Read: ఇతగాడికి ఏ అవార్డు ఇద్దాం చెప్పండి..? ఎండ్రకాయతో బెండకాయ కట్ చేయించాడు

ఛాతిలోకి గునపం దిగినా అతడి ధైర్యం చెక్కుచెదరలేదు.. మరణం.. అతడి మనోధైర్యం ముందు మోకరిల్లింది

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!