ఛాతిలోకి గునపం దిగినా అతడి ధైర్యం చెక్కుచెదరలేదు.. మరణం.. అతడి మనోధైర్యం ముందు మోకరిల్లింది

ప్రమాదం ఎటువైపు ముంచుకొస్తుందో అస్సలు ఊహించలేం. ఏం చెయ్యకుండా ఇంట్లో కూర్చున్నా కూడా మృత్యువు తరుముకుంటూ...

ఛాతిలోకి గునపం దిగినా అతడి ధైర్యం చెక్కుచెదరలేదు.. మరణం.. అతడి మనోధైర్యం ముందు మోకరిల్లింది
Rod In Body
Follow us

|

Updated on: Aug 14, 2021 | 5:35 PM

ప్రమాదం ఎటువైపు ముంచుకొస్తుందో అస్సలు ఊహించలేం. ఏం చెయ్యకుండా ఇంట్లో కూర్చున్నా కూడా మృత్యువు తరుముకుంటూ రావొచ్చు. కాగా అకస్మాత్తుగా ప్రమాదానికి గురైనప్పుడు కూడా గుండె ధైర్యం ఉంటే.. పునర్జీవం పొందొచ్చు. అవును ఎదురీత ముందు విధిరాత ఎంత చెప్పండి. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. బ్రతకాలన్న అతడి ఆశ ముందు మృత్యువు తలవంచింది. మరణం.. అతడి ధైర్యం ముందు మోకరిల్లింది. గుండెకు అతి సమీపం నుంచి 6 అడుగుల పొడవైన ఇనుప రాడ్డు దూసుకుపోయినా.. అతడు బ్రతికాడు . వైద్యుల నిర్విరామ కృషికి అతడి సంకల్ప బలం తోడవ్వడం వల్ల మరణాన్ని జయించి నిలిచాడు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని బఠిండా-దిల్‌ కంబౌ నేషనల్ హైవేపై ఇటీవల ప్రమాదం జరిగింది. శ్రీ గురు హరగోబింద్ థర్మల్ ప్లాంట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గుండె సమీపం నుంచి ఆరు అడుగుల పొడవైన ఓ ఇనువు రాడ్డు దూసుకుపోయింది. ఈ షాకింగ్ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు.

అసలేం  జరిగిందంటే… 

హర్దీప్‌సింగ్‌ అనే వ్యక్తి టాటా ఏస్‌ వాహనంలో ప్రయాణిస్తుండగా దాని టైరు పేలి పోయింది. దీంతో ఈ వాహనం ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని ఢీ కొనడం వల్ల అందులోని ఆరు అడుగుల గునపం లాంటి ఇనుప రాడ్డు హర్దీప్‌ ఛాతిలోకి దిగబడింది. వెంటనే స్పందించిన స్థానిక యువకులు హర్దీప్‌ను దగ్గర్లోని ఆదేష్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స ప్రారంభించారు. ముందుగా శరీరం బయట ఉన్న ఇనుప రాడ్డును.. కట్టర్‌ సాయంతో కట్ చేశారు. తర్వాత ఆరుగురు సర్జన్లు.. 15 మంది ఆరోగ్య సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేశారు. సర్జరీ సమయంలో విపరీతంగా రక్తం కారుతుండడం.. డాక్టర్స్ టీమ్‌కి పెద్ద సవాలుగా మారింది. అయినా ఆటంకాలను అధిగమించిన వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఇనుప రాడ్డు కొన్ని అంగుళాలు కిందకు దిగితే గుండె ముక్కలు ముక్కలయ్యేదని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం హర్దీప్‌సింగ్‌ కోలుకుంటున్నట్లు వెల్లడించారు.

Also Read:ఇంటి చూరుపై పాముల సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. జనాలు గద్దించినా

బస్సులో విండ్ సీట్‌లో కూర్చుని చెయ్యి బయట పెట్టి ప్రయాణిస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త

Latest Articles
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి