Disha App: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ యాప్‌ చూపిస్తే బస్సు ప్రయాణం ఉచితం!

విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Disha App: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ యాప్‌ చూపిస్తే బస్సు ప్రయాణం ఉచితం!
Vizianagaram Free Bus Fecility For Women
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 14, 2021 | 8:33 PM

Free bus for Women: విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశా యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరంలో మహిళలు తమ మొబైల్ ఫోన్‌లలో దిశా యాప్‌ను చూపిస్తే.. పట్టణంలోని ముఖ్య కూడళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్పీ దీపికా పాటిల్‌ వెల్లడించారు. ఇందుకోసం పోలీస్‌ శాఖ రెండు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. శనివారం విజయనగరంలో దిశా యాప్‌పై నిర్వహించిన అవగాహన సదస్సుకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి హాజరయ్యారు.

Ap Dy Cm Pushpa Srivani

Ap Dy Cm Pushpa Srivani

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం సీఎం జగన్‌ ఈ గొప్ప యాప్‌ను తీసుకొచ్చారన్నారు. ప్రతి మహిళా తనను తాను రక్షించుకునేందుకు ఇదో ఆయుధంలా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతిఒక్కరూ ఈ యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉండాలని, ప్రతిఒక్కరికీ ఆదర్శంగా నిలవాలన్నారు.

ఇదిలావుంటే, ‘దిశ యాప్’. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మహిళల భద్రతకు భరోసా.. వారికో రక్షణ.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందింపచేసిన దిశ యాప్ ప్రతి మహిళ మొబైల్‌లో ఒక ఆయుధంలా ఉండాలని జగన్ సర్కారు సంకల్పించింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుు ఒక్క బటన్ నొక్కి ఉక్కుపాదం మోపేలా దిశా యాప్ ను డెవలప్ చేసింది ఏపీ ప్రభుత్వం. మహిళల మానప్రాణాలకు రక్షణే ప్రధాన కర్తవ్యంగా దిశా యాప్‌ను రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ సంకల్పంగా దిశ యాప్‌కు విస్తృత ప్రచారం కల్పించింది.

ఇందులో భాగంగానే ఆపదలో ఉన్న ప్రతి మహిళ అత్యవసర సాయం కోసం దిశ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు ఆయా ప్రాంతాల్లోని పోలీసులు అందుబాటులోకి వచ్చేలా దిశ యాప్‌ను ప్రతి మహిళ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉండేలా చేసింది. ఆపదలో చిక్కుకున్న మహిళ దిశ యాప్ ఉపయోగించగానే, ఆమె ఉన్న లొకేషన్ తోపాటు చిరునామా దిశ కమాండ్ కంట్రోల్ రూమ్ కు సెకన్లలోనే సమాచారంగా చేరుతుంది. వాయిస్‌తో పాటు పది సెకన్ల వీడియో కూడా రికార్డ్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కి తమ విపత్కర పరిస్థితిని దిశ యాప్ ద్వారా చేరవేస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళలకు రక్షణగా నిలిచే ఆ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్‌ తెలిపారు.

Read Also… 

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!