AP Employees Transfers: ఏపీ ఎంప్లాయిస్ బదిలీ పాలసీ సర్కార్ ఫోకస్.. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం..?
వివిధ శాఖల అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సమావేశమయ్యారు.
AP Employees Transfer Policy: వివిధ శాఖల అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ సమావేశమయ్యారు. ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగుల బదిలీ పాలసీపై సీఎస్ సమీక్షించారు. త్వరలోనే చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియపై ఈ సందర్భంగా చర్చించారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ మంచికాదని అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే, వివిధ కారణాలతో ప్రభుత్వానికి వచ్చిన రిక్వేస్ట్ ట్రాన్‌ఫర్స్ మాత్రమే చేసే అంశంపై చర్చకు వచ్చింది. కాగా, సీపీఎస్ రద్దు సాధ్య సాధ్యాలపై చర్చించిన సీఎస్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర పథకాల అమలు.. కేంద్ర నిధుల వినియోగంపై చర్చించారు. సచివాలయంలో అధికారులు, ఉద్యోగుల హాజరుపై సీఎస్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి, ముఖ్య మంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, జీఏడి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఇదిలావుంటే శుక్రవారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సీనియర్ ఐఏఎస్ అధికారులందరితో సుదీర్ఘం గా సమావేశమయ్యారు. రాష్ట్ర సచివాలయానికి ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగుల హాజరై చర్చించారు. ఇదిలావుంటే, పది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఓ సమీక్షలో ఐఏఎస్ అధికారులు ఎక్కువగా సచివాలయానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, దీంతో ఇక నుంచి అందరూ రాష్ట్ర సచివాలయానికి వచ్చి పని చేయాలని సీఎస్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీపై ఏపీ సీఎస్ అదిత్యనాధ్ దాస్ సమీక్ష నిర్వహిచడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, త్వరలోనే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు స్థాన చలనం తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి.