AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DGP: ఒకే బడిలో చదివిన చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు.. ఇద్దరూ మనోళ్లే..

చిన్ననాటి స్నేహితులు.. ఒకే బడిలో చదువుకున్నారు. పదవ తరగతి కూడా కలిసి మెలిసే పూర్తి చేశారు. ఉన్నత విద్యను ఒకే చోట అభ్యసించారు. ఇద్దరి లక్ష్యం ఒకటే.. అనుకున్న విధంగానే సివిల్ సర్వీస్ కు ఎంపికయ్యారు. అత్యుత్తమ సర్వీస్ అందించిన వారిద్దరూ ఒకే సమయంలో రాష్ట్ర పోలీస్ బాస్ సీట్లో కూర్చున్నారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు.. ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు, శ్రీనివాస్..

DGP: ఒకే బడిలో చదివిన చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు డీజీపీలు.. ఇద్దరూ మనోళ్లే..
Dwaraka Tirumala Rao - Srinivas
T Nagaraju
| Edited By: |

Updated on: Jun 22, 2024 | 7:41 PM

Share

చిన్ననాటి స్నేహితులు.. ఒకే బడిలో చదువుకున్నారు. పదవ తరగతి కూడా కలిసి మెలిసే పూర్తి చేశారు. ఉన్నత విద్యను ఒకే చోట అభ్యసించారు. ఇద్దరి లక్ష్యం ఒకటే.. అనుకున్న విధంగానే సివిల్ సర్వీస్ కు ఎంపికయ్యారు. అత్యుత్తమ సర్వీస్ అందించిన వారిద్దరూ ఒకే సమయంలో రాష్ట్ర పోలీస్ బాస్ సీట్లో కూర్చున్నారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు.. ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు, శ్రీనివాస్..

గుంటూరుకు చెందిన ద్వారకా తిరుమల రావు ఏపి డిజిపి కాగా, నగరానికే చెందిన శ్రీనివాస్ పాండిచ్చేరి డిజిపిగా ఏడాది నుండి సేవలు అందిస్తున్నారు. వీరిద్దరూ గుంటూరులోని క్రిష్ణా నగర్ ప్రాధమిక పాఠశాలలో ఐదో తరగతి వరకూ చదుకున్నారు. ఆ తర్వాత పదో తరగతి పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిజి అభ్యసించారు. గుంటూరు నగరానికే చెందిన ద్వారకా తిరుమల రావు ఆ తర్వాత సివిల్స్ రాసి 1989లో ఏపి కేడర్ కే ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాలో ఎస్పీగా సేవలందించారు. విభజన ఏపిలో విజయవాడ కమీషనర్ గా పనిచేసిన ద్వారకా తిరులరావును ప్రస్తుతం డిజిపి పదవి వరించింది. ఆయన డిజిపిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఒంగోలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ తండ్రి ఉద్యోగరీత్యా గుంటూరు వచ్చి స్థిరపడ్డారు. దీంతో శ్రీనివాస్ కూడా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ తిరుమల రావుతో కలిసే చదువుకున్నారు. శ్రీనివాస్ 1990లో ఐపిఎస్ గా జమ్మూ కాశ్మీర్ క్యాడర్ కు ఎంపికయ్యారు. గత ఏడాది ఆయన పాండిచ్చేరి డిజిపిగా బాధ్యతలు స్వీకరించి కొనసాగుతున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇప్పటికీ గుంటూరులో తాము చదువుకున్న పాఠశాలకు వస్తుంటారు.

School

తమతో చదువుకున్న తమ స్నేహితులు ఒకే సమయంలో రెండు రాష్ట్రాలకు డిజిపిలుగా ఎంపిక కావడంతో వారి మిత్రుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. వారి స్నేహితుడు హోమియో వైద్యుడిగా చేస్తున్న ఓవి రమణ వీరిద్దరిని తమ పాఠశాలకు తీసుకొచ్చి.. సన్మానంచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా కలిసి చదివిన పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్లో పూర్వ విద్యార్ధులు ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పాటిబండ్ల శీతారామయ్య హైస్కూల్ సెక్రటరీ గా ఉన్న పాటిబండ్ల విష్ణుతో ఈ విషయాన్ని చర్చించి స్నేహితులిద్దరికీ ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పోలీస్ శాఖలో అత్యన్నత పదవులను అలంకరించిన వీరిద్దరిని స్పూర్తిగా తీసుకొని విద్యార్దులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని శీతారామయ్య హైస్కూల్ సెక్రటరీ పాటిబండ్ల విష్ణు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..