- Telugu News Photo Gallery Political photos Deputy CM Pawan Kalyan receives the petitions of the victims who came with problems at the Janasena party central office in Mangalagiri.
Pawan Kalyan: రోడ్డుపైనే పవన్ ‘ప్రజాదర్బార్’.. బాధితులతో ముచ్చటిస్తూ అర్జీలు స్వీకరించిన డిప్యూటీ సీఎం..
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకొనేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే కాన్వాయి ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
Updated on: Jun 22, 2024 | 8:05 PM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకొనేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే కాన్వాయి ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకొని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు.

కొన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజా సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సమస్యలతో ఉన్న ప్రజలు తనను కలుసుకునేందుకు ఎప్పుడొచ్చినా తాను వారిని స్వయంగా కలుస్తానన్న మాటను నిజం చేశారు.

విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని.. ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేశారని బాధితురాలు పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు.

కర్నూలు జిల్లాకు చెందిన సువర్ణ తన కుమారుడికి బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు. జగయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పని చేస్తున్న శ్రీ పాటి నాగరాజు అనే అవుట్ సోర్సింగు ఉద్యోగి తనను రాజకీయ పరమైన కారణాలతో కక్షకట్టి ఉద్యోగం నుంచి తొలగించారని, తనను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్‌కు వినతిపత్రం అందజేశారు.

అలాగే 30 మంది దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరితో ప్రత్యేకంగా మాట్లాడిన రాష్ట్ర మంత్రి పవన్ కళ్యాణ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారి వద్ద నుంచి అర్జీలు తీసుకుని వారిని సురక్షితంగా అక్కడి నుంచి తమ ప్రాంతాలకు పంపిచారు.
