AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఊరిలో ముగ్గురు మైనర్లకు పెళ్లి..! అధికారులు ఎంట్రీ ఇచ్చేసరికే..

ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో ఒకే రోజు మూడు బాల్య వివాహాలు జరిగాయి. ICDS, పోలీస్, రెవెన్యూ అధికారులు విచారణ చేసే సమయానికి పెళ్లిళ్లు పూర్తయ్యాయి. 15, 16, 20 ఏళ్ల మైనర్ల వివాహాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడం ఆందోళనకరం.

ఒకే ఊరిలో ముగ్గురు మైనర్లకు పెళ్లి..! అధికారులు ఎంట్రీ ఇచ్చేసరికే..
Child Marriage
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Apr 16, 2025 | 8:49 PM

Share

బాల్య వివాహం నేరమని అధికారులు ఎన్ని ప్రచారాలు చేసినా, వారి కళ్ళు కప్పి కొంతమంది బాల్య వివాహాలు చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి ముగ్గురు మైనర్లకు ఒకే గ్రామంలో పెళ్లిళ్ళు జరుగుతున్నాయని ICDS అధికారులకు సమాచారం అందింది. కానీ, అధికారులు వెళ్లే సరికే అక్కడ జరగాల్సిన పెళ్లితంతు జరిగిపోయింది. జిల్లా బాలల సంరక్షణ అధికారిణి శారద తెలిపిన వివరాల మేరకు మంగళవారం రాత్రి కలెక్టర్ కార్యాలయం నుండి ఆదోని మండలం గణేకల్ గ్రామంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదు తో ఈ రోజు ఉదయం ICDS , పోలీస్ , రెవెన్యూ అధికారులతో కలిసి పాండవగల్ గ్రామంలో పెళ్ళిళ్లు జరుగుతున్న ఇళ్ల వద్దకు వెళ్ళి విచారణ చేశారు.

అయితే అప్పటికే మైనర్ 15 ఏళ్ల బాలితో 24 ఏళ్ల రంగస్వామికి, 16 ఏళ్ల బాలికతో 20 ఏళ్ల కుర్రాడికి, 20 ఏళ్ల కుర్రాడితో 19 ఏళ్ల అమ్మాయికి పెళ్ళిళ్లు జరిగిపోవడంతో చేసేదేమీ లేక వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లకు పెళ్ళిళ్లు చేసిన తల్లితండ్రులపై , బాల్య వివాహాలకు ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని , బాల్య వివాహం చేసుకున్న వారికి వివాహ అర్హత వయసు వచ్చేవరకు ఆగాలని కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.