Cm Jagan-Delhi: నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ.. పూర్తి వివరాలివే..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను మంగళగిరిలోని ముఖ్యమంత్రి
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్‌ను మంగళగిరిలోని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. సీఎం జగన్ ఇవాళ ఉదయం 10.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు నిధులు, జల వివాదాలతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాత్రికి డిల్లీలోనే బస చేయనున్న సీఎం జగన్.. మరుసటి రోజు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు.
Also read:
KGF-2: కేజీఎఫ్-2 నుంచి ఇంట్రెస్టింగ్ రూమర్.. ఆ వింటేజ్ సాంగ్ రీమిక్స్ చేశారా..!
Gangula Kamalakar: రాజకీయ లబ్ధి పొందేందుకు బండి సంజయ్ దీక్ష.. మంత్రి గంగుల ఆగ్రహం..
NFO: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నుంచి ప్యాసివ్ మల్టీ అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్..