NFO: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నుంచి ప్యాసివ్ మల్టీ అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్..
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎన్ఎఫ్ఓ వచ్చింది. అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ప్యాసివ్ మల్టీ అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనే పథకం...
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎన్ఎఫ్ఓ వచ్చింది. అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ప్యాసివ్ మల్టీ అసెట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం. ఈక్విటీలతోపాటు, రుణ పత్రాలు, బంగారం, అంతర్జాతీయ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్‌లలో మదుపు చేయడం దీనికి ఉన్న ప్రత్యేకత. ఈ ఓపెన్ ఎండెడ్ పథకం ఎన్‌ఎఫ్‌ఓ జనవరి 10న ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ.1,000 పెట్టాల్సి ఉంటుంది.
క్రిసిల్ హైబ్రిడ్ 50+50 టీఆర్‌ఐ (80 శాతం వెయిటేజీ)తో పాటు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ 1200 ఇండెక్స్ (15 శాతం వెయిటేజీ), దేశీయ బంగారం ధర (5 శాతం వెయిటేజీ)ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు నగదు లభ్యత (లిక్విడిటీ) పెంచేందుకు గత రెండేళ్లుగా చర్యలు తీసుకున్న విషయం విదితమే. తత్ఫలితంగా ఈక్విటీ పెట్టుబడులపై అధిక లాభాలు కనిపించాయి. కానీ ఇకపై ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ నగదు లభ్యతను తగ్గించేందుకు, వడ్డీరేట్లు పెంచేందుకు కేంద్ర బ్యాంకులు మొగ్గుచూపే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో పలు రకాలైన పెట్టుబడి సాధనాలకు (మల్టీ- అసెట్) పెట్టుబడులను మళ్లించటం ద్వారా నష్టభయం తగ్గించుకోవటానికి, ఒక మోస్తరు లాభాలు ఆర్జించటానికి అవకాశం ఉందనేది నిపుణుల అంచనా వేస్తున్నారు. ఈ ఫండ్ నిర్వహణ వ్యయం (ఎక్స్‌పెన్సెస్ రేషియో), రెగ్యులర్ ప్లాన్‌కు 1 శాతం కంటే మించి ఉండదు. డైరెక్ట్ ప్లాన్ అయితే 0.4 శాతమే. ఈ ఎన్ఎఫ్ఓ ఇదొక సానుకూలతగా చెప్పొచ్చు.
Read Also.. PAN Card: మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నాయా..? జాగ్రత్త.. ఇబ్బందుల్లో పడ్డట్లే..!