Chicken Rates: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రేట్ ఎంతో తెలుసా.?
Chicken Rates AP: ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ ప్రభావం కారణంగా జనవరిలో కిలో రూ. 120 ఉన్న చికెన్ ధర...
Chicken Rates AP: ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ ప్రభావం కారణంగా జనవరిలో కిలో రూ. 120 ఉన్న చికెన్ ధర.. ఫిబ్రవరిలో రూ. 150కి చేరుకోగా.. ఇక ఇప్పుడు అది కాస్తా రూ. 200 దాటింది. రాష్ట్రంలోని కొన్ని చోట్ల అయితే కిలో చికెన్ ధర రూ. 220 పలుకుతోంది. ఇదిలా ఉంటే గతంలో బాయిలర్ కోళ్ల కేజీ రేటు రూ. 75-85 ఉండగా.. ప్రస్తుతం రూ. 115కు చేరింది. బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గడంతో పాటు కరోనా సెకండ్ వేవ్ కారణంగా చికెన్ రేట్లు పెరిగాయని వ్యాపారస్తులు అంటున్నారు.
కాగా, మహాశివరాత్రి తర్వాత చికెన్ ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు లేకపోలేదు. సమ్మర్‌లో పౌల్ట్రీల నిర్వహణ కష్టతరంగా ఉంటుంది కాబట్టి.. ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఆ సమయంలో చికెన్ రేట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కోడి గుడ్ల ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం డజన్ కోడి గుడ్ల ధర రూ. 60 పలుకుతుండగా.. 100 కోడి గుడ్ల ధర హోల్‌సేల్‌లో రూ. 400కు చేరింది.
మరిన్ని ఇక్కడ చదవండి:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!