AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Rates: ఇక లొట్టలే.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.!

మాంసం ప్రియులు ఇక లొట్టలు వేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.? కొందరికి సండే వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటివారి కోసమే ఈ స్టోరీ.. ఈ వారం చికెన్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..

Chicken Rates: ఇక లొట్టలే.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు.!
Chicken Rates
Ravi Kiran
|

Updated on: Jan 19, 2025 | 10:17 AM

Share

సండే వచ్చిందంటే చాలు చాలామందికి ముక్కలెనిదే ముక్క దిగదు. ఇక తెలంగాణలో అయితే.. ప్రతీ చిన్న కార్యానికి ముక్క ఉండాల్సిందే. అయితే గత కొంతకాలంగా మాంసం ధరలు ఆకాశాన్నంటాయి. కొండెక్కిన చికెన్ ధరలతో.. మాంసం ప్రియులు చికెన్ కొనలేక.. తినలేక కొట్టుమిట్టాడారు. అయితే ఇప్పుడు మాంసం ప్రియులకు ఇది నిజంగానే శుభవార్తే.. ఎందుకంటే చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఇది చదవండి: ఐపీఎల్‌లో 9 కోట్ల ప్లేయర్.. కట్ చేస్తే.. 8 ఫోర్లు, 5 సిక్సర్లతో శివతాండవం ఆడాడు.. ఎవరంటే.?

ఒకప్పుడు కేజీ చికెన్ రూ. 280 నుంచి రూ. 300 వరకు ఉండగా.. ఇప్పుడు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 220 నుంచి రూ. 230గా ఉంది. అటు ఏపీలోనూ చాలా ప్రాంతాల్లో కేజీ చికెన్ రూ. 240 వరకు ఉంది. లైవ్ బర్డ్ కేజీ రేటు రూ. 117గా కొనసాగుతోంది. ఇక గుడ్డు ధర విషయానికొస్తే.. 12 కోడిగుడ్ల రిటైల్ ధర రూ. 70గా ఉంది. అలాగే ఒక్కో గుడ్డు రూ. 5.83గా పలుకుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఎమర్జెన్సీ లోన్ కావాలా.? ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎలానో తెల్సా

మాంసం షాపులు బంద్..

అటు కర్ణాటకలోని ఎలహంక ప్రాంతంలోని మాంసం ప్రియులకు అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది. ఎలహంకలో ఏరో ఇండియా 15వ ఎడిషన్ జరగనుంది. ఈ క్రమంలోనే ఏరో ఇండియా ఎడిషన్ జరిగే 13 కిలోమీటర్ల పరిధిలోని మాంసం దుకాణాలు క్లోజ్ చేయనున్నారు. జనవరి 23 నుంచి ఫబ్రవరి 17 వరకు ఆ ప్రాంతంలో మాంసాహారం అమ్మకంపై నిషేధం విధించారు.

ఇది చదవండి: పటాస్ మూవీ చిన్నది గుర్తుందా.? అందాలతో అరాచకమే.. ఇప్పుడు చూస్తే స్టన్!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి