Chandrababu: కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డ్‌కు ఎంపికైనా కియా కార్‌.. అభినందించిన చంద్రబాబు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియాకు మోడల్‌ కారెన్స్‌ కారు ఈ సంవత్సరం ఇండియన్‌ కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికైంది. దీంతో కియాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారుల..

Chandrababu: కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డ్‌కు ఎంపికైనా కియా కార్‌.. అభినందించిన చంద్రబాబు
Chandrababu
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2023 | 12:25 PM

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియాకు మోడల్‌ కారెన్స్‌ కారు ఈ సంవత్సరం ఇండియన్‌ కార్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికైంది. దీంతో కియాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారుల నుంచి ఇటు రాజకీయ నేతల వరకు అందరి ప్రశంసలు పొందుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కియాపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు కియా సాధించిన అవార్డుపై చంద్రబాబు ట్వీట్‌ చేశారు. కియా అవార్డు సాధించడం గర్వకారణమని చెప్పుకొచ్చారు. అయితే అనంతపురం ప్లాంట్‌లో తయారైన కియా కారెన్స్ మోడల్ కార్‌కు Indian car of the year 2023 అవార్డ్ రావడంపై చంద్రబాబు అభినందనలు.

ఇవి కూడా చదవండి

గతంలో టీడీపీ హయాంలో ఏపీలో కియా కంపెనీ అడుగు పెట్టిందని, అప్పట్లో కియా కంపెనీకి కావాల్సిన అన్ని రకాల అవసరాలను అందించడం జరిగిందని, కంపెనీ రాకకు ఎంతో తోడ్పడినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏపీలో ఏర్పాటైన తమ ప్లాంట్‌ విస్తరణతో పాటు కొత్త మోడళ్ల వాహనాలను తయారు చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి