Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gurajada Apparao Award: గురజాడ పురస్కారం అందుకున్న చాగంటి కోటేశ్వరరావు..

గురజాడ పురస్కారాన్ని అందుకున్నారు ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు. విజయనగరంలో చాగంటికి పురస్కారం ప్రధానం చేసింది గురజాడ సాంస్కృతిక సమాఖ్య

Gurajada Apparao Award: గురజాడ పురస్కారం అందుకున్న చాగంటి కోటేశ్వరరావు..
Chaganti
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 30, 2022 | 10:21 PM

గురజాడ పురస్కారాన్ని అందుకున్నారు ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు. విజయనగరంలో చాగంటికి పురస్కారం ప్రధానం చేసింది గురజాడ సాంస్కృతిక సమాఖ్య. గురజాడ పురస్కారాన్ని ఆశీస్సుగా భావించానని చెప్పారు చాగంటి కోటేశ్వరరావు. పురస్కారానికి తాను అర్హుడిగా భావించడం లేదన్నారు. పురస్కారం విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇవ్వడం ఇబ్బంది అయితే రద్దు చేయాలని కోరానని.. వేరొకరికి ఇచ్చినా సభకు వస్తానని చెప్పానన్నారు చాగంటి. ఇక గురజాడ పురష్కార ప్రధానోత్సవంలో సంచలన కామెంట్స్ చేశారు విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి. సిగ్గుతో చెబుతున్నా ఈరోజుకి కన్యాశుల్కం రిలెవెన్స్ ఉందన్నారు. తమ జిల్లాలో మహిళల సంఖ్య చాలా తక్కువ ఉందన్నారు కలెక్టర్. గురజాడ చెప్పిన కన్యాశుల్కం తిరిగి వచ్చే ప్రమాదం ఉందన్నారు సూర్యకుమారి.

గతంలో గురజాడ పురస్కారాన్ని అందుకున్నది విశిష్ట వ్యక్తులు వీరే..

1. జేవి సోమయాజులు.

2. గొల్లపూడి మారుతీరావు.

ఇవి కూడా చదవండి

3. సి నారాయణ రెడ్డి.

4. కే విశ్వనాథ్.

5. గుమ్మడి వెంకటేశ్వరరావు.

6. షావుకారు జానకి.

7. ‘మల్లెమాల’ ఎంఎస్ రెడ్డి.

8. అంజలీ దేవి.

9. రావి కొండలరావు.

10. వంశీ (డైరెక్టర్)

11. తనికెళ్ల భరణి.

12. చాట్ల శ్రీరాములు.

13. ఆచార్య మొదలి నాగభూషణ శర్మ.

14. సుద్దాల అశోక్ తేజ.

15. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.

16. గరికపాటి నరసింహారావు.

17. ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం.

18. డైరెక్టర్ క్రిష్.

19. రామజోగయ్య శాస్త్రి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..