Andhra Pradesh: వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు : కేంద్ర ఎన్నికల సంఘం
సీఎం జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎంపిక చెల్లదని స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపింది.
YSRCP: వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్(CM Jagan) ఎంపికైనట్లు వచ్చిన వార్తలపై సీఈసీ స్పందించింది. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని తెలిపింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు ఉండకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలని.. శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు.. ప్రజాస్వామ్యానికి విరుద్దమని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఎన్నికలు జరగాలని వెల్లడించింది. ఈ వ్యవహారంలో పార్టీకి లేఖలు రాసినా పట్టించుకోలేదని.. వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు పంపారు కేంద్ర ఎన్నికల కమిషనర్. ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తలపై అయోమయానికి తెరదించాలని కోరారు. దీనిపై బహిరంగ ప్రకటన చేయాలని వైసీపీని ఆదేశించారు. కాగా YSRCP శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని నియమించారన్న వార్తలపైన అంతర్గతంగా విచారణ ప్రారంభించినట్లు వైసీపీ స్పష్టం చేసింది. విచారణలో వచ్చిన వాస్తవాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘానికి తెలిపింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి