Baby Tigers in CCTV: తల్లి కోసం తల్లిడిల్లుతున్న పులి పిల్లలు.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు..
అడవిలో పెద్ద పులి... అడవి బయట పులి కూనలు... ఎరక్కపోయి ఇరుక్కుపోయాయి పిల్ల పులి కూనలు. ఆహారం కోసం వచ్చి తల్లీపిల్లలు వేరైపోయాయి.
అడవిలో పెద్ద పులి… అడవి బయట పులి కూనలు.. ఎరక్కపోయి ఇరుక్కుపోయాయి పిల్ల పులి కూనలు. ఆహారం కోసం వచ్చి తల్లీపిల్లలు వేరైపోయాయి. గత నాలుగు రోజులుగా తల్లి ప్రేమ కోసం పిల్లలు విలవిలలాడున్నాయి. జాడలేని తల్లి కోసం కలవరం చెందుతున్నాయి. తల్లి పిల్లలను కలిపేందుకు ఫారెస్ట్ సిబ్బందికి ఇదో బిగ్ టాస్క్‌గా మారిపోయింది. ప్రస్తుతానికి ఆత్మకూరు డీఎఫ్‌ఓ కార్యాలయంలో పులికూనలను సంరక్షిస్తున్నారు. ఓ గదిలో వాటిని ఉంచి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. పులికూనల ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వస్తుండటంతో తొలిసారి సీసీ కెమెరాలు ఫుటేజ్ రిలీజ్ చేశారు ఫారెస్ట్ అధికారులు. పులి పిల్లలకు పాలు, ఉడకబెట్టిన లివర్‌ను ఆహారంగా ఇస్తున్నారు అటవీశాఖ అధికారులు. కేవలం ఆహారం అందించేందుకే పులి కూనల గదిలోకి సిబ్బందిని అనుమతిస్తున్నారు. పులి కూనలను ముట్టుకోకుండా ఉండేందుకు, పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆపరేషన్ ఫెయిల్..
ఇదిలాఉంటే.. పులి కూనలను తల్లి వడికి చేర్చేందుకు ఆత్మకూరు ఫారెస్ట్ అధికారులు చేపట్టిన మదర్ టైగర్ ఆపరేషన్ విఫలమైంది. నిన్న అర్ధరాత్రి అర్థరాత్రి12గం.ల నుంచి ఉదయం 6 వరకు మదర్ టైగర్ ఆపరేషన్ T108 కొనసాగించారు. రాత్రంతా ముసలిమడుగు ప్రాంతాల్లో తల్లి పులి కోసం వేచిచూశారు ఫారెస్ట్ అధికారులు. తల్లిపులి రాకపోవడంతో పులి పిల్లలను ఆత్మకూరు DFO కార్యాలయానికి మళ్లీ తరలించారు. తెల్లవారితే ఎండ వేడిమికి పులి పిల్లలు ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో ఆపరేషన్ ను నిలిపివేశారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరా, ప్లగ్ మార్క్స్ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. NTCA ఆదేశాల మేరకు తదుపరి చర్యలు కొనసాగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..