AP News: జగన్ మామయ్యా మజాకా..! మెనూలో మరో ఐటమ్.. గర్భిణులు, బాలింతలకు కూడా
వారంలో 2 రోజులపాటు మునగ ఆకుతో చేసిన కూర, పప్పు అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు ప్రతి రోజూ ఆహారంలో మొదటి ముద్ద మునగ ఆకు పొడితో తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు విలువైన పౌష్టికాహారం అందించే లక్ష్యంలో భాగంగా జగన్ సర్కార్ మరో కీలక ముందడుగు వేసింది. పోషక విలువలు అత్యధికంగా ఉండే మునగను అంగన్‌వాడీ మెనూలో చేర్చింది. అంతేకాదు మునగను ఆహారంలో తీసుకోవడం ద్వారా.. ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. అంగన్‌వాడీ కేంద్రాల వర్కర్స్ ద్వారా గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌లో, ఇళ్ల వద్ద మునగ చెట్ల పెంచే కార్యక్రమం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రొగ్రామ్ సక్సెస్ అయ్యింది.
మునగ చెట్లను పెంచి.. వాటి నుంచి ఆకును సేకరించి.. వారంలో 2 రోజులపాటు అంగన్‌వాడీ మెనూలో మునగాకు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మునగ ఆకు పప్పు, మునగాకు కూర ఇలా ఏదో ఒక రూపంలో ఫుడ్‌లో అది ఉండేలా ప్రణాళిక రూపొందించారు. మునగ ఆకులో ఉండే ఐరన్ గర్భిణులు, బాలింతల నుంచి రక్త హీనతను దూరం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, విటమిన్ ఏ పుష్కలంగా అందుతుంది. గర్భిణుల్లో పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు మునగ ఆకు తోడ్పడుతుంది. సుఖ ప్రసవానికి సాయపడుతుంది. బాలింతల్లో పాలు పెరిగేందుకు దోహదపడుతుంది. గుడ్ ఫాట్ కూడా శరీరానికి అందుతుంది.
ఏపీలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్నిసర్కార్ అందచేస్తోంది. గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి 6 సంవత్సరాలలోపు చిన్నారులుకు కలిపి.. సుమారు 36 లక్షల మందికి అంగన్‌వాడీల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..