Brahma kamalam: కోనసీమలో వికసించిన బ్రహ్మ కమలం.. అరుదైన పుష్పాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్న జనాలు..

Brahma kamalam: ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలోనూ కనువిందు చేస్తున్నాయి. తాజాగా కోనసీమ..

Brahma kamalam: కోనసీమలో వికసించిన బ్రహ్మ కమలం.. అరుదైన పుష్పాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్న జనాలు..
Brahma Kmalam
Follow us

|

Updated on: Jul 03, 2021 | 11:47 AM

Brahma kamalam: ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలోనూ కనువిందు చేస్తున్నాయి. తాజాగా కోనసీమ ముఖద్వారంగా పిలువబడే రావులపాలెంలో శుక్రవారం రాత్రి బ్రహ్మ కమలాలు వికసించాయి. వివరాల్లోకెళితే.. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం కు చెందిన ధర్మరాజు నరసింహ రాజు తన ఇంట్లో ఈ అరుదైన బ్రహ్మ కమలం మొక్కను పెంచుతున్నాడు. అయితే, ఈ మొక్కకు పది రోజుల క్రితం నాలుగు మొగ్గలు వచ్చాయి. వాటిలో రెండు శుక్రవారం రాత్రి నుంచి వికసించడాన్ని నరసింహ గమనించారు. బ్రహ్మ కమలాలు వికసించడంతో అక్కడ సందడి నెలకొంది.

ఈ నేపథ్యంలోనే నరసింహారావు కుటుంబ సభ్యులు బ్రహ్మ కమలం మొక్కకు పూజలు నిర్వహించారు. శనివారం స్థానిక శివాలయంలో స్వామి వారికి సమర్పిస్తామని ఆయన తెలిపారు. ఈ బ్రహ్మ కమలం శివునికి ప్రీతిపాత్రమైన పుష్పంగా పురాణాలు చెబుతున్నాయి. ఏడాదిలో ఒకసారి మాత్రమే.. అది కూడా రాత్రి వేళల్లో మాత్రమే పూసే ఈ పువ్వులు శ్వేత వర్ణంలో, పెద్దగా వికసిస్తాయి. రాత్రి వేళల్లో కొద్ది గంటల పాటు మాత్రమే వికసించి, అందాలొలికించి ఉదయానికి మొగ్గలా ముడుచుకుంటాయి. ఆకుల నుంచి పుష్పించే ఈ పుష్పాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాగా, కొన్నేళ్ల నుంచి నరసింహ ఇంట్లోని బ్రహ్మ కమలం చెట్టుకి ప్రతీ ఏటా బ్రహ కమలాలు వికసిస్తున్నాయి.

Brahma Kmalam Blossoms Video:

Also read:

Road Accident: వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నవ వధువు

Post Office Recruitment: పదవ తరగతి ఉత్తీర్ణత అయిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ లో ఉద్యోగావకాశాలు

Thunder Storm: భూమిపై వీరికి ఇంకా నూకలున్నాయి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఏం జరిగిందంటే..?

Latest Articles