Road Accident: వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నవ వధువు

Newly Married Woman Dies: వివాహ వేడుక ఘనంగా జరిగింది.. సందడి సందడిగా.. వరుడు, వధువు కుటుంబాలు పెళ్లి మండపం నుంచి బయలుదేరి ఇళ్లకు పయనమయ్యాయి. వివాహం

Road Accident: వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నవ వధువు
Marriage
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 03, 2021 | 11:22 AM

Newly Married Woman Dies: వివాహ వేడుక ఘనంగా జరిగింది.. సందడి సందడిగా.. వరుడు, వధువు కుటుంబాలు పెళ్లి మండపం నుంచి బయలుదేరి ఇళ్లకు పయనమయ్యాయి. వివాహం జరిగి కొన్ని గంటలు కూడా కాకముందే.. వధువును మృత్యువు కబళించింది. క్రూజర్‌ను టెంపో ఢీకొని నూతన వధువు మరణించింది. ఈ దుర్ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా సింధగి తాలూకా బి.కె.యలగల్ల గ్రామంలో చోటుచేసున్నట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. మృతురాలిని రాణి (26)గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో పెళ్లి కొడుకు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

యాదగిరి జిల్లాలోని షాహాబాద్‌కు చెందన గణేష్, రాణికి గురువారం వివాహం జరిగింది. అనంతరం నవ దంపతులు క్రూజర్‌ వాహనంలో శుక్రవారం ఉదయం కూకటనూరు గ్రామానికి దైవదర్శనం కోసం వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టెంపో ఢీకొంది. దీంతో నవ వధువు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సింధగి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సింధగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Kidnap: ఎల్బీనగర్‌లో కిడ్నాప్ కలకలం.. అర్ధరాత్రి కలప వ్యాపారిని అపహరించిన దుండగులు

Darbhanga blast case: తండ్రి యోదుడు.. కొడుకులు మాత్రం కసాయిలు.. ఎందుకిలా..?