Andhra Pradesh: వైసీపీకి భారీ షాక్.. పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే.. ఏ పార్టీలో చేరుతున్నారంటే..?

కాకినాడ జిల్లా పిఠాపురంలో రోజుకో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఘనవిజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ప్రజలను వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు పవన్ కళ్యాణ్.

Andhra Pradesh: వైసీపీకి భారీ షాక్.. పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే.. ఏ పార్టీలో చేరుతున్నారంటే..?
Pendem Dorababu
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 07, 2024 | 4:33 PM

కాకినాడ జిల్లా పిఠాపురంలో రోజుకో రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఘనవిజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ప్రజలను వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఏ పదవిని ఆశించకుండా నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్దమవుతున్నట్లు ప్రకటించారు. క్యాడర్‌కు న్యాయం చేసేందుకు మాత్రమే పార్టీ మారుతున్నట్టు వెల్లడించారు దొరబాబు.

గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ నుంచి పిలుపు వచ్చినప్పటికీ దూరంగా ఉన్నారు. సిట్టింగ్ సీట్ కాదని, వైసీపీ టికెట్ మరో నియోజకవర్గంలో ఇస్తానని చెప్పడంతో పార్టీ టికెట్ రాకపోయినా నియోజకవర్గ ప్రజల కోసం వైసీపీలో కొనసాగారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీతకు దొరబాబుకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వీరి మధ్య సఖ్యత కుదరలేదని కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. 25 ఏళ్లుగా పిఠాపురం ప్రజానీకంతో మమేకమైన దొరబాబు, రెండుసార్లు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదట 2004లో బీజేపీ నుంచి గెలవగా, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వర్మపై గెలుపొందారు పెండం దొరబాబు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి మరోసారి తనకు సీటు దక్కుతుందని ఆశించారు దొరబాబు. అయితే వైసీపీ అధిష్టానం సరిగా పట్టించుకోవడంతో అప్పటినుంచి సైలెంట్ అయిపోయారు. కాపు సామాజిక వర్గానికి చెందిన దొరబాబుకు నియోజకవర్గంలో మంచి సౌమ్యుడిగా, వివాద రహితుడిగా గుర్తింపు ఉంది. అయినప్పటికీ వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో కొన్ని రోజులుగా కినుక వహించారు. తాజాగా ఆపార్టీకి రాజీనామా చేసిన దొరబాబు కూటమిలో చేరతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు కూటమినేతలతో టచ్ లో ఉన్నట్లు కూడా చెప్పారు దొరబాబు. త్వరలోనే తనతో ఉన్న సీనియర్ కేడర్ మొత్తం కూటమి వైపు చేరుతున్నట్లు.. వెల్లడించారు.

అయితే కూటమిలో జనసేనలో చేరతారా లేదా టీడీపీకి వెలుతారా అనే చర్చ పిఠాపురంలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నుంచి చేరాలంటూ ఒత్తిడి వస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే గతంలో దొరబాబు అల్లుడు రామయ్య జనసేన అధినేతతో పవన్ కళ్యాణ్ తో మంతనాలు జరిపారట. పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేశారట. అయితే తాజాగా కొన్ని నెలలుగా పరిస్థితులు బాగోవడంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు దొరబాబు. ఆయనతో ఉన్న క్యాడర్ మొత్తం కూడా జనసేనలో జాయిన్ అవ్వాలని ఒత్తిడి తెస్తున్నాట్లు తెలుస్తోంది. పార్టీ మారి రాజకీయంగా పెత్తనం చేయాలనే ఆలోచన ఏమి లేదని, ఇక్కడ ఉన్నవారిని ఇబ్బంది పెట్టకుండా సమన్వయంగా ముందుకు వెళ్తానని అంటున్నారు దొరబాబు.

పిఠాపురం నియోజకవర్గంలో గతంలో చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయాయని, వాటిని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు దొరబాబు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసే పనుల్లో భాగస్వామ్యుడినై నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానంటున్నారు పెండెం దొరబాబు. ఒక వారం రోజుల్లో టీడీపీ గానీ జనసేనలో గాని వెళ్లి ఆలోచనలో పెండం దొరబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

నియోజకవర్గ మెజార్టీ వర్గం జనసేనలోకి వెళ్లాలంటూ సూచనలు చేస్తున్నారట. ఒకసారి జనసేనలోకి నో చెప్పిన దొరబాబుకి, పవన్ కళ్యాణ్ మరోసారి ఎంట్రీ ఇస్తారా..? లేక గత సీనియారిటీ ఉపయోగించి తెలుగుదేశం పార్టీలో చేరతారా అన్న చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం మంత్రి నారా లోకేష్ దగ్గర ఉన్నట్లు సమాచారం. పెండెం దొరబాబు కూటమి పార్టీలో చేరగానే, ఆ తరవాత మొత్తం కేడర్ తో ఏ పార్టీలో చేరబోతున్నారో చూడాలి మరి..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…