చంద్రబాబు CM ఎలా కావొచ్చో సలహా ఇచ్చిన YCP నేత

ఓ వైపు భారత్ పర్యటనకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన చేస్తుండగా.. ఏపీలో రాజధాని రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో అమరావతిలో మరోసారి కులరాజకీయాలు తెరమీదకొచ్చాయి. ఇటీవల లేమల్లె గ్రామంలో జరిగిన ఓ ఘటన ఇందుకు ఆజ్యం పోసింది. దళిత ఎంపీ అయిన తనపై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయిస్తున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. మరోవైపు తప్పుడు ప్రచారం మానుకోవాలని.. కావాలనే ఓ సామాజికవర్గాన్ని బూతులు తిడుతూ రాజధాని గ్రామాల్లో […]

చంద్రబాబు CM ఎలా కావొచ్చో సలహా ఇచ్చిన YCP నేత
Follow us

| Edited By:

Updated on: Feb 25, 2020 | 5:37 AM

ఓ వైపు భారత్ పర్యటనకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన చేస్తుండగా.. ఏపీలో రాజధాని రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ క్రమంలో అమరావతిలో మరోసారి కులరాజకీయాలు తెరమీదకొచ్చాయి. ఇటీవల లేమల్లె గ్రామంలో జరిగిన ఓ ఘటన ఇందుకు ఆజ్యం పోసింది. దళిత ఎంపీ అయిన తనపై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయిస్తున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. మరోవైపు తప్పుడు ప్రచారం మానుకోవాలని.. కావాలనే ఓ సామాజికవర్గాన్ని బూతులు తిడుతూ రాజధాని గ్రామాల్లో వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది. ఇదిలా ఉంటే.. దళితుడు కావడంతోనే తనను టార్గెట్‌ చేశారని..అమరావతి మండలంలో రథోత్సవానికి వెళ్లి వస్తుంటే… కారం ప్యాకెట్లు, కర్రలతో హత్యాయత్నం జరిగిందంటూ నందిగం సురేష్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ఏం జరిగినా చంద్రబాబు, లోకేష్‌లదే బాధ్యతని.. ఈ కుట్ర వెనక ఆలపాటి రాజా, గల్లా జయదేవ్‌ కూడా ఉన్నారని ఆరోపించారు. ఎంపీ హాట్ కామెంట్స్‌తో అమరావతి చుట్టూ ఉన్న రాజకీయ వేడి.. ఒక్కసారిగా రాష్ట్రాన్ని తాకింది. ఇక ఇదే అంశంపై టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఆధ్వర్యంలో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ జరిగింది.

ఈ డిబేట్‌లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌.. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుళ్లూరు మండలంలో ఏ కులస్థులు ఎంతమంది ఉన్నారో అన్న అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ.. టీడీపీ ఎమ్మెల్సీల మధ్య హాట్ హాట్‌గా చర్చ కొనసాగింది. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా అంటూ ఎంపీ ప్రశ్నించారు. అంతేకాదు.. మీ టీడీపీ పార్టీ వారంతా కలిసి ఓ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని.. అక్కడ చంద్రబాబును పర్మినెంట్‌గా సీఎంగా నియమించుకోండంటూ వైసీపీ ఎంపీ సెటైర్‌లు వేశారు.