జగన్ సర్కార్ మరో దూకుడు నిర్ణయం.. ఇక ఏపీ మొత్తం సిట్ పరిధిలోకే..

జగన్ సర్కార్ మరోకీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌కు రాష్ట్రంలో ఎక్కడైనా విచారణ జరిపే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మొత్తం సిట్ పరిధిలోకి వస్తుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ప్రభుత్వ అవకతవకలపై క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా సిట్ విచారణ చేపట్టనుంది. ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో ఈ సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో […]

జగన్ సర్కార్ మరో దూకుడు నిర్ణయం.. ఇక ఏపీ మొత్తం సిట్ పరిధిలోకే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 25, 2020 | 6:40 AM

జగన్ సర్కార్ మరోకీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌కు రాష్ట్రంలో ఎక్కడైనా విచారణ జరిపే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మొత్తం సిట్ పరిధిలోకి వస్తుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ప్రభుత్వ అవకతవకలపై క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా సిట్ విచారణ చేపట్టనుంది. ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో ఈ సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై సిట్‌ విచారణ చేపట్టనుంది. సీఆర్‌డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, బినామీ లావాదేవీల ఆరోపణలపై సిట్ దృష్టి సారించనుంది.

అటు ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాల ఆరోపణలపైనన కూడా సిట్‌ విచారణ చేపట్టనుంది. అయితే సిట్‌కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెట్టింది సర్కార్. ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం సిట్‌కు ఉందంటూ తొలుత విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సిట్ పరిధిలోకి వస్తుంది అని మరో కీలక నిర్ణయం తీసుకుంది.