ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమ్మకానికి ప్రజావేదిక ఫర్నీచర్..

ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఉండవల్లి లోని సీఎం చంద్రబాబు నివాసం పక్కన ఉన్నటువంటి ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దాదాపు వారం రోజుల పాటుగా ఈ కూల్చివేతలు కొనసాగాయి. అయితే ఈ కూల్చివేతల తర్వాత.. అక్కడ ఉన్న విలువైన సామాగ్రిని అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించలేదు. కేవలం చిన్న చిన్న పూలమొక్కలు వంటివే తీసుకెళ్లారు కానీ.. విలువైన సామాగ్రిని అక్కడే వదిలేశారు. అయితే ఇప్పుడు ఆ […]

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమ్మకానికి ప్రజావేదిక ఫర్నీచర్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 25, 2020 | 6:28 AM

ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఉండవల్లి లోని సీఎం చంద్రబాబు నివాసం పక్కన ఉన్నటువంటి ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దాదాపు వారం రోజుల పాటుగా ఈ కూల్చివేతలు కొనసాగాయి. అయితే ఈ కూల్చివేతల తర్వాత.. అక్కడ ఉన్న విలువైన సామాగ్రిని అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించలేదు. కేవలం చిన్న చిన్న పూలమొక్కలు వంటివే తీసుకెళ్లారు కానీ.. విలువైన సామాగ్రిని అక్కడే వదిలేశారు. అయితే ఇప్పుడు ఆ పరికరాలను రక్షించడం ఇబ్బందులు కలుగడంతో పాటుగా.. ఆ పరికరాలను స్టోర్ చేస్తే పాడైపోయే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సీఆర్డీఏ ప్రజావేదిక పరికరాలను వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ప్రజావేదిక పరికారల వేలం పత్రాల వివరాలను.. మార్చి 3లోగా వెబ్‌సైట్‌ నుంచి పొందాలని.. మార్చి 4న మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.