Big breaking: చంద్రబాబుకు జగన్ మరో షాక్

జగన్ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చింది. దాంతో ఏపీలో రాజకీయ వేడి మరోసారి రగులుతోంది. గత మూడు నెలలుగా ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ఉప్పు, నిప్పులా మారిన రాజకీయ రచ్చ మరింత వేడి అందుకుంది.

Big breaking: చంద్రబాబుకు జగన్ మరో షాక్
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 24, 2020 | 7:33 PM

Jagan has given big shock to Chandrababu: ఏపీ ప్రభుత్వం మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద షాక్ ఇచ్చింది. అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే గతంలో చంద్రబాబు నివాసమున్న ప్రజావేదిక అక్రమ నిర్మాణమంటూ కూల్చేసిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా చంద్రబాబుకు జగన్ మరో పెద్ద షాక్ ఇచ్చినట్లయింది.

ప్రజావేదిక కూల్చినపుడు సేకరించిన పరికరాలను వేలం వేయాలన్నది తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని సీఆర్డీయే నిర్ణయించింది. అయితే.. సీఆర్డీయే రద్దు చేస్తూ గతంలోనే అసెంబ్లీ తీర్మానించింది. అలాంటి సీఆర్డీయే ఏ నిర్ణయం తీసుకున్నా.. అది ప్రభుత్వం తీసుకున్నట్లే. అయితే.. సీఆర్డీయే రద్దు టెక్నికల్‌గా ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి సీఆర్డీయే ద్వారానే ఈ వేలం నిర్ణయం వెలువడినట్లు భావించాలి.

తొమ్మిది నెలల క్రితం కూల్చేసిన ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని సోమవారం నిర్ణయించారు. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను 9 నెలల క్రితం కూల్చిన అధికారులు అక్కడ్నించి పెద్ద ఎత్తున పరికరాలను సేకరించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అక్రమ కూల్చివేతను సహించేది లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ వెంటనే అంటే మర్నాడే అధికారులు ప్రజావేదిక కూల్చివేతకు చర్యలు తీసుకున్నారు.

ప్రజా వేదికను కూల్చినప్పుడు సేకరించిన ఏసీలు, ఇతర పరికరాలను 9 నెలల పాటు అలానే ఉంచేశారు సీఆర్డీయే అధికారులు. తాజాగా ఈ పరికరాలను వేలం వేయాలని నిర్ణయించిన అధికారులు.. మార్చి 3వ తేదీలోగా వేలం పత్రాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకోవాలని సూచనలు జారీ చేశారు. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు వేలం ప్రారంభం అవుతుందని ప్రకటించారు సీఆర్డీయే అధికారులు.

Also read: Chandrababu fires at CM Jagan సీఎం జగన్ మీద చంద్రబాబు ఆగ్రహం