Trump tie story: ట్రంప్ గారి ‘టై’ కథ.. కలర్ వెనుక కథ ఇదే

అమెరికా అధ్యక్షుని హోదాలో తొలిసారి భారత్ వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. తన డ్రెస్ కోడ్‌తో కీలక సందేశం మోసుకొచ్చాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సతీమణి మెలానియా, కూతురు ఇవాంకలతో కలిసి ఒకేసారి టూర్‌కు వెళ్ళడం కూడా చాలా రేర్. అలాంటిది వీరిద్దరితో కలిసి ఆయన భారత్‌కు వచ్చారు.

Trump tie story: ట్రంప్ గారి ‘టై’ కథ.. కలర్ వెనుక కథ ఇదే
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 24, 2020 | 7:11 PM

Donald Trump visit of India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టైలే సెపరేటు. తనకు నచ్చిన పని చేసేందుకు, నచ్చిన చోటికి వెళ్ళేందుకు ట్రంప్ ఏనాడు వెనుకాడడు. అమెరికా అధ్యక్షుడుగా ఎన్నిక కాకముందైతే ట్రంప్ కథ మరోలా వుండేది. రెజ్లింగ్, మూవీస్, టీవీషోస్, టీవీ సీరియల్స్, యాడ్స్.. ఇలా దేనిమీద ఎప్పుడు మక్కువ అయితే అప్పుడు తనదైన శైలి అక్కడ వాలిపోయేవాడు. అమ్మాయిలు.. పబ్బులు, డగ్ర్స్ లాంటివి కూడా ట్రంప్‌కు అంతా మామూలేనంటారు చాలా మంది.

అయితే, అధ్యక్షుని హోదాలో తొలిసారి భారత్‌కు వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. తన డ్రెస్.. కాదు.. కాదు.. తాను కట్టుకున్న నెక్ టైతోనే ఇండియాకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి.. అదే సమయంలో యావత్ ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చారని ఆయన గురించి బాగా తెలిసిన వారు, ఆయన వేషధారణను అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

నెక్ టై తో మెసేజ్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? జస్ట్ రీడ్ దిస్..

డొనాల్డ్ ట్రంప్ అత్యంత సంపన్నుడైన వ్యక్తి అని అందరికీ తెలిసిందే. కార్పొరేట్ వ్యవహారాలలో ఆరితేరిపోయారు.. తల పండిపోయారు. ట్రంప్ ఎక్కువగా బ్లూ లేదా బ్లాక్ సూట్‌లో రెడ్ కలర్ నెక్ టై కట్టుకునే కనిపిస్తారు. కానీ భారత్ పర్యటన కోసం ఆయన అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టినపుడు ఆయన బ్లూ కలర్ బ్లేజర్, ట్రౌజర్ వేసుకున్నారు. లోపల తెల్లని అంగీ తొడుక్కుని.. పైనుంచి ఎల్లో కలర్ (పసుపుపచ్చ) నెక్ టై కట్టుకుని విభిన్నంగా కనిపించారు.

అమెరికన్ సంప్రదాయం ప్రకారం రెడ్ నెక్ టై కట్టుకుంటే తాము అత్యంత పవర్ ఫుల్ అనే సంకేతాన్నిచ్చినట్లు. అందుకే తన డామినేషన్‌ని చాటుకునేందుకు ట్రంప్ ఎక్కువగా రెడ్ కలర్ టై కట్టుకుంటారు. కానీ అందుకు భిన్నంగా భారత్ పర్యటనకు వచ్చినపుడు ఆయన ఎల్లో కలర్ నెక్ టైతో దర్శనమిచ్చారు.. శాంతి సందేశాన్ని వ్యాప్తి చేసేపుడు, నిజమైన శ్రేయోభిలాషులను కలుసుకునేపుడు ఎల్లో కలర్ నెక్ టై కట్టుకోవడం చాలా మంది అమెరికన్లకు అలవాటు అని చెబుతుంటారు.

ట్రంప్ తన జీవితంలో చూడని, వెళ్ళని చోటు లేదు. రకరకాల మనుషులతో ఆయన కల్వడం అత్యంత పరిపాటి. అదే సమయంలో తన టై ద్వారా తాను కలుసుకునే వారికి తన అభిమతాన్ని చాటడం కూడా ట్రంప్‌కు అలవాటు. అమెరికన్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఆయన భారత్‌ను తన శ్రేయోభిలాషిగా చూస్తున్నారు. తాను రెండోసారి గెలిచేందుకు అమెరికాలో వున్న భారతీయుల ఓట్లు అత్యంత కీలకం. భారతీయులంతా తనకు శ్రేయోభిలాషులు.. తీవ్రవాదంపోరాడే శాంతి కాముకులు అన్న సందేశం ఇచ్చేందుకు ట్రంప్ ఎల్లో కలర్ నెక్ టైతో భారత గడ్డమీద అడుగుపెట్టాడని విశ్లేషకుల అభిప్రాయంగా వినిపిస్తోంది.

Read this also: గాంధీ నివాసంలో మోదీ జపం Trump once again praised Modi