AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengal Tiger: కనిపించి కనిపించకుండా.. వినిపించి వినిపించకుండా పరుగులు పెట్టిస్తున్న బెంగల్ టైగర్.. పట్టుకునేదెలా..

Royal Bengal Tiger: బెబ్బులి భయపెడుతోంది. పల్లెలను హడలెత్తిస్తోంది. మూడు వారాలుగా... మూడు మండలాల్లో సంచరిస్తూ బెంబేలెత్తిస్తోంది. ఎన్ని ఎత్తుగడలు వేసినా, చిక్కనంటోంది. అధికారుల వ్యూహాలను తిప్పికొడుతోంది. అయితే..

Bengal Tiger: కనిపించి కనిపించకుండా.. వినిపించి వినిపించకుండా పరుగులు పెట్టిస్తున్న బెంగల్ టైగర్.. పట్టుకునేదెలా..
Bengal Tiger
Sanjay Kasula
|

Updated on: Jun 16, 2022 | 11:40 AM

Share

ఒకట్రెండు రోజులు కాదు.. 25 రోజులుగా దాదాపు 11 గ్రామాల ప్రజల్ని పెద్దపులి బెంబేలెత్తిస్తోంది. అధికారుల చేతికి చిక్కినట్టే చిక్కి, చిక్కకుండా పోతోంది. రోజుకో గ్రామశివారులో తిరుగుతూ.. దడ పుట్టిస్తోంది. పులి భయంతో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నారు జనం. లేటెస్ట్‌గా శరభవరం సమీపంలో సంచరించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో పరిసర ప్రాంతాల్లో సెర్చింగ్‌ ముమ్మరం చేశారు. మూడు వారాలుగా ప్రతిపాడు మండలంలో సంచరిస్తున్న టైగర్‌.. బుధవారం శరభవరం శివారులో పశువులపై దాడి చేసింది. పులిదాడిలో పశువుల మెడ భాగంలో తీవ్రగాయాలయ్యాయి. పులి పాదముద్రల్ని గుర్తించిన అధికారులు.. సమీప ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. ఇక పెద్దపులికి సంబంధించిన డిటేయిల్స్‌ చూస్తే ఆశ్చర్యం కులుగుతుంది. అయితే.. ఇప్పుడు పెద్ద పులిని బంధించడం ఫారెస్ట్‌ అధికారులకు బిగ్‌ టాస్క్‌గా మారింది. దాని అడుగు జాడలను గుర్తించి సెర్చ్ చేస్తుంటే.. అది మరో వైపు వెళ్ళిపోతోంది. అయా ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి.. మాంసాన్ని ఎరగావేసినా…చిక్కడం లేదు. దాదాపు 150మంది అధికారులు పులి ఆచూకీ కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు టీవీ9 కూడా ఆపరేషన్‌ సెర్చింగ్‌లో పాల్గొంటుంది.

ఇదిలావుంటే ప్రత్తిపాడు, ఏలేశ్వరం మైదాన ప్రాంతాల్లోని వందల ఎకరాల్లో ఉన్న సరుగుడు తోటలు పులికి అనువుగా మారాయి. కారణాలేవైనా.. ప్రజలు ప్రాణాలరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇంకా అంతుచిక్కని ఈ పులి కథ ఎప్పుడు సుఖాంతం అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, కొడవలి, వజ్రకూటం ప్రాంతాలు.. కొండలు, వాగులు, పుష్కర, ఏలేరు కాలువలతో ఉంటాయి.

వందల ఎకరాల్లో సరుగుడు తోటలు, చెట్లతో ఉన్న మెట్టలు అడవిని తలపిస్తాయి. ఇదే అనువుగా బెబ్బులి భావించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆకలికి మించి వేటాడని పెద్ద పులి ఇప్పటికి అయిదు పశువులపై పంజా విసిరింది.

ఇవి కూడా చదవండి

పెద్ద పులిని గుర్తించడం ఫారెస్ట్ అధికారులకి బిగ్‌ టాస్క్‌గా కనిపిస్తోంది. దాన్ని అడవిలోకి పంపేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. యుక్త వయసులో ఉన్న టైగర్‌ చాలా తెలివిగా సంచరిస్తుంది. పెద్దపులి జనావాసాల్లోకి రాకుండా సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా జనాల్లో మాత్రం పెద్దపులి ఫియర్‌ వణికిస్తోంది.

ఏపీ వార్తల కోసం..