పని చేసుకుంటూ పరుగులు తీసిన కూలీలు.. అయోమయంలో తోటి మహిళలు..

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న కూలీలందరూ పరుగులు తీశారు. ఏం జరిగిందో ఎందుకు పరుగులు తీస్తున్నారో తెలుసుకునేలోపై జరగాల్సింది జరిగిపోయింది. ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టి దాడికి తెగబడడంతో వాటి నుంచి తప్పించుకునే దారి తెలియక సుమారు 20కి మంది పైగా కూలీలు గాయాల పాలయ్యారు.

పని చేసుకుంటూ పరుగులు తీసిన కూలీలు.. అయోమయంలో తోటి మహిళలు..
Honey Bees
Follow us
B Ravi Kumar

| Edited By: Ram Naramaneni

Updated on: May 15, 2024 | 9:03 PM

ఏలూరు, మే 14: ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న కూలీలందరూ పరుగులు తీశారు. ఏం జరిగిందో ఎందుకు పరుగులు తీస్తున్నారో తెలుసుకునేలోపై జరగాల్సింది జరిగిపోయింది. ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టి దాడికి తెగబడడంతో వాటి నుంచి తప్పించుకునే దారి తెలియక సుమారు 20కి మంది పైగా కూలీలు గాయాల పాలయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని విలీన మండలమైన కుక్కునూరు మండలం దామరచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. దామరచర్ల గ్రామంలోని గ్రామస్తులు ఉపాధి హామీ కూలి పనికి వెళ్లారు. వారందరూ ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. అయితే ఆ ప్రాంతానికి ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో తెలియదు గానీ పెద్ద తేనెటీగల సమూహం వచ్చింది. అక్కడ ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలందరిపై ఒక్కసారిగా ఆ తేనెటీగలు దాడికి తెగబడ్డాయి. కనిపించిన వారిని కనిపించినట్టు గాయపరుస్తూ ఆ ప్రాంతంలోని కూలీలు అందర్నీ తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.

దాంతో అక్కడున్నవారు అందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీయడం ప్రారంభించారు. తోటి పనివారికి తమ పక్కన ఉన్న వారు ఎందుకు పరుగులు పెడుతున్నారో తెలియనంతగా అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే వారు తేరుకుని తేనెటీగలు తమపై దాడి చేస్తున్నాయని గ్రహించి కొందరూ తమ వద్ద ఉన్న కండువాలను తిప్పుతూ వాటిని దూరంగా తరిమే ప్రయత్నం చేశారు. అప్పటికే సుమారు 20 మందికి పైగా ఉపాధి హామీ కూలీలు తేనెటీగల దాడిలో గాయపడ్డారు. తేనెటీగల దాడిలో గాయపడిన కూలీలను హుటాహుటిన అమరవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో వైద్యులు బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్