Vanjangi Hill Point: తొలిపొద్దు వేళ కనువిందు చేస్తున్న మేఘాల దుప్పటి.. వంజంగి హిల్స్‌లో ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు..
నవంబర్ నెల.. వణికించే శీతాకాలం.. పైగా వీకెండ్.. ఇవి చాలు కదా ప్రకృతి ప్రేమికులు రెక్కలు కట్టుకుని ఏజెన్సీలో వాలిపోవడానికి. విశాఖ మన్యంలో
నవంబర్ నెల.. వణికించే శీతాకాలం.. పైగా వీకెండ్.. ఇవి చాలు కదా ప్రకృతి ప్రేమికులు రెక్కలు కట్టుకుని ఏజెన్సీలో వాలిపోవడానికి. విశాఖ మన్యంలో వంజంగి కొండకు పర్యాటకులు క్యూకట్టారు. ఉషోదయపు వెలుగుల్లో మంచు మేఘాల్ని చూసేందుకు కొందరు రాత్రే అక్కడకు చేరుకుంటే.. చాలా మంది తెల్లవారుజామునే ట్రెక్కింగ్ చేస్తూ వ్యూ పాయింట్‌కి వెళ్లారు. ఎత్తైన కొండపైనుంచి దూదిపింజెల్లా తేలుతున్న మేఘాల్ని చూస్తూ మైమరచిపోయారు.
ఇదిలాఉంటే.. అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. జిల్లాలోని మినుములూరు 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. వంజంగి మేఘాల కొండ ప్రాంతానికి వెళ్లిన వాళ్లంతా ఈ చలికి గజగజ వణుకుతూనే ఆ ప్రకృతి దృశ్యాల్ని తమ కెమెరాల్లో బంధిస్తూ, ఫొటోలు దిగుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఉదయాన్నే గిరిజన గ్రామాల్లో స్థానికులు చలిమంటలు కాగుతున్న దృశ్యాలు కూడా ఎక్కడిక్కడ కనిపిస్తున్నాయి.
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి..
ఇక తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రంగా అంతకంతకూ పెరిగిపోతోంది. ఉదయం 8 దాటినా మంచు దుప్పటి దట్టంగా కమ్ముకునే ఉంటోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సిర్పూర్(యు)లో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవగా, ఆదిలాబాద్ జిల్లా బేల 8.3, నేరడిగొండ 8.3 డిగ్రీలు నమోదైంది. ఉత్తర, ఈశాన్య భారత్ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. తీవ్రమైన చలి కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని జనం గజగజా వణికి పోతున్నారు. ఓ పక్క కొమురంభీం , ఆదిలాబాద్ జిల్లాలను పులి వణికిస్తుంటే మరోపక్క చలి తీవ్రత ఎముకల కొరికేస్తుంది. పది దాటినా బయటకు రావాలంటే జనం జంకుతున్నారు.
This Climate ? ? ?????? . .#vizag #visakapatnam #Vanjangi #viewpoint #hills #mountain #view pic.twitter.com/DXNmexQ6Re
— Kiran Kumar Koduri (@_kirankoduri) October 11, 2022
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..