Andhra Pradesh: ఆ ఘటనను మరవకముందే మరోసారి.. రాత్రయితే వింత శబ్దాలు.. ఎలుగుబంటి సంచారంతో భయం భయం
శ్రీకాకుళం (Sirkakulam) జిల్లా ప్రజలను ఎలుగుబంట్ల సంచారం కలవరపెడుతోంది. గతంలో జరిగిన ఘటనలను మరిచిపోకముందే మళ్లీ ఎలుగుబంటి కనిపించడం ఆందోళన రేపుతోంది. జిల్లాలోని మందస మండలం..
శ్రీకాకుళం (Sirkakulam) జిల్లా ప్రజలను ఎలుగుబంట్ల సంచారం కలవరపెడుతోంది. గతంలో జరిగిన ఘటనలను మరిచిపోకముందే మళ్లీ ఎలుగుబంటి కనిపించడం ఆందోళన రేపుతోంది. జిల్లాలోని మందస మండలం మొగిలిపాడు గ్రామంలో ఎలుగుబంటి (Bear) కలకలం సృష్టించింది. రాత్రి పూట గ్రామంలోని వీధుల్లో సంచరిస్తూ గ్రామస్థులకు తారసపడింది. ఎలుగుబంటి స౦చార౦తో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. గ్రామస్తులు అరవడ౦తో ఎలుగుబంటి పరారైంది. తిరిగి గ్రామంలోకి వస్తుందేమోననే భయంతో రాత్ర౦తా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి, ఎలుగుబంటిని పట్టుకోవాలని కోరుతున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు.
గతంలో జరిగిన ఘటనలో ఎలుగుబంటి దాడిలో వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామానికి చెందిన ఓ రైతు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో ఏడుగురు ఎలుగు దాడిలో గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. దీనిని సవాల్ గా తీసుకున్న అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి ఎలుగుబంటిని పట్టుకున్న అటవీ అధికారులు జూకీ తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఎలుగుబంటి చనిపోవడం విషాదం రేపింది.
అయితే.. ఎలుగుబంట్లు తరచూ తమ స్థావరాలు మార్చుకుంటాయి. వీటి సంచారంతో భయపడాల్సిన పనేమీ లేదని, ప్రజలకు రక్షణ కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..