Andhra Pradesh: బెజవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. టీడీపీ నాయకుడిపై దాడి.. పరిస్థితి విషమం..

విజయవాడ నగరం మరో మారు రాజకీయ కక్షలతో భగ్గుమంది. టీడీపీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు చావు బతుకుల మధ్య హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం.. టీడీపీ సీనియర్‌నేత చెన్నుపాటి గాంధీపై

Andhra Pradesh: బెజవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. టీడీపీ నాయకుడిపై దాడి.. పరిస్థితి విషమం..
Ap News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 04, 2022 | 8:22 AM

TDP leader attacked in Vijayawada: విజయవాడ నగరం మరో మారు రాజకీయ కక్షలతో భగ్గుమంది. టీడీపీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు చావు బతుకుల మధ్య హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రం.. టీడీపీ సీనియర్‌నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. పటమటలంకలోని గర్ల్స్‌ హైస్కూల్‌ వద్ద గాంధీపై వైసీపీకి చెందిన వర్గీయులు దాడి చేసి గాయపర్చారు. కంటికి తీవ్రగాయాలు కావడంతో తాడిగడప ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి వైసీపీ వర్గీయులు, దేవినేని అవినాష్‌ మనుషులే చేశారని టీడీపీ ఆరోపించింది. విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో చెన్నుపాటి గాంధీ భార్య తొమ్మిదో డివిజన్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్‌ మద్యం మత్తులో కావాలని గొడవపడినట్టు సమాచారం. వల్లూరు ఈశ్వర్‌ ప్రసాద్‌, వైసీపీ నాయకులు గద్దె కల్యాణ్‌, సుబ్బుతో పాటు మరో ముగ్గురు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.

కాగా. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌. దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాంధీ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. దాడిలో గాంధీ కంటికి తీవ్ర గాయం అయ్యిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. ఈ దాడి కారణంగా చెన్నుపాటి గాంధీకి కంటి చూపు పోయే ప్రమాదం ఉందని వైద్యులు చంద్రబాబుకు ఫోన్‌లో వివరించారు. మెరుగైన చికిత్స అందే విధంగా చూడాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి.. కఠినంగా శిక్షించాలని చంద్రబాబు పోలీసులను కోరారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే టీడీపీ నేతలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇంకెన్నాళ్లీ నెత్తుటి రాజ‌కీయాలు చేస్తారంటూ నారా లోకేశ్‌ వైసీపీపై మండిపడ్డారు. చెన్నుపాటి గాంధీ పై దాడికి తెగ‌బ‌డింది వైసీపీ ఫ్యాక్షన్ మూక‌లే అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..