Watch Video: పిఠాపురంలో తెరపైకి ఆధిపత్య పోరు.. ఆ విషయంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు..

పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేశారు. నాయకులు ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి కట్టుగా పని చేయడంతో ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఇది మూడ్నాళ్ల ముచ్చటే అయింది. కూటమి గెలిచి నాలుగు రోజులు కూడా గడవక ముందే ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది.

Watch Video: పిఠాపురంలో తెరపైకి ఆధిపత్య పోరు.. ఆ విషయంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు..
Janasena, Tdp
Follow us

|

Updated on: Jun 10, 2024 | 10:12 AM

పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేశారు. నాయకులు ఇచ్చిన పిలుపుతో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి కట్టుగా పని చేయడంతో ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఇది మూడ్నాళ్ల ముచ్చటే అయింది. కూటమి గెలిచి నాలుగు రోజులు కూడా గడవక ముందే ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇరు వర్గాలు ఆందోళనకు దిగారు. ప్రఖ్యాత అపర్ణ దేవి ఆలయ బాధ్యతల కోసం టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యేగా ఏ పార్టీ వారు ఉంటే ఆ పార్టీ వారికే ఆలయ బాధ్యతలు నిర్వహణ ఇవ్వాలంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పట్టుబడుతున్నారు. పవన్ కళ్యాణ్ నెగ్గడంతో తాటిపర్తి గ్రామంలో జనసేన నాయకులకు బాధ్యతలిచ్చారు ఆలయ మాజీ చైర్మన్. మరోవైపు ఆలయ నిర్వహణ తమదే అంటున్నారు టీడీపీ నాయకులు.

మరోవైపు ఇటీవల టీడీపీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. వైసీపీలో పనిచేసిన వారిని ఎవరిని కూడా పార్టీలోకి తీసుకోవద్దంటూ హుకుం జారీ చేసిన వర్మే గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామ సర్పంచును పార్టీలోకి తీసుకొచ్చేందుకు పావులు కదిపారు. ఇదే విషయమై మాట్లాడి వస్తున్న వర్మపై జనసేన నాయకులు దాడి చేశారు. ఆ దాడిలో వర్మ కారు పూర్తిగా ధ్వంసం అయింది. ఇది కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ వర్గీయులు తను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు వర్మ. ఇది జరిగిన రోజులు వ్యవదిలోనే అపర్ణాదేవి ఆలయ ఆధిపత్యం కోసం ఆధిపత్య పోరుకు మళ్లీ తెరలేగిసింది. ఇదే కాకుండా పిఠాపురం పాదగయా ఆలయానికి దగ్గరలో ఉన్న జనసేన ఫ్లెక్సీలు గుర్తు తెలియని దుండగులు చించేశారు.

పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. జనసేన కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. తాటిపర్తి గ్రామంలో జరిగిన ఘటన గురించి కూడా తమకు సమాచారం అందిదని.. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు నాగబాబు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ఈ ప్రాంతం నేడు దాడులు, ఘర్షణలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గి పిఠాపురంకు ఇంకా రాకుండానే జనసేన- టీడీపీ చెలిమికి బీటలు బారుతుంది. ఇలా రోజుకో చోట ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటే కూటమి సభ్యులు చులకనైపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పూర్తి వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..