Festival Offer: వారెవ్వా.. భలే పండుగ బంపర్ ఆఫర్.. ఇక మందుబాబులకు పండగే పండగ
Festival Offer: పండగలు వచ్చాయంటే చాలా మందుబాబులకు ఎంజయే. ఇప్పుడు సంక్రాంతి పంగడల వస్తోంది. ఈ నేపథ్యంలో బార్‌అండ్ రెస్టారెంట్ యజమానులు మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్‌తో వారికి పండగే.. పండగ. ఈ అద్భుతమైన ఆఫర్లతోనే చీరాలలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు..

Festival Offer: కొత్త ఏడాది, పండుగుల సీజన్లలో బంపర్ ఆఫర్ల పేరుతో, లక్కీడీప్‌ల తరహాలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ అమ్మకాలు చేసే సంస్థలు తక్కువ ధరలకే వివిధ రకాల ఉపకరణాలు అందిస్తుంటాయి. ఇందులో విశేషం ఏముంది అంటారా..? అలాంటి ఆఫర్లతోనే చీరాలలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు మందుబాబులకు సంక్రాంతి పండుగ ఆఫర్ ఇస్తున్నారు.చిత్తుగా తాగి 3 వేల రూపాయల బిల్లు చేస్తే ఓ లక్కీ కూపన్ ఇస్తారట. ఆ కూపన్లను డ్రా తీసి స్కూటీ, ఎల్‌ఈడి టివి, ఏసిలు బహుమతులుగా అందిస్తారట. ఇదేదో మనకోసమే అనుకుంటూ మందుబాబులు క్యూ కడతారని నిర్వాహకుల ఆశ.
బాపట్లజిల్లాలోని చీరాల ప్రాంతం చినబొంబాయిగా పేరుగాంచింది. ఇక్కడ వస్త్ర పరిశ్రమ వ్యాపారం దేశంలోనే ప్రఖ్యాతి గాంచింది. వస్త్ర దుకాణ యజమానులు పండుగ సీజన్‌లో ముఖ్యంగా మహిళలను ఆకర్షించేందుకు తెగ ఆఫర్లు ఇస్తుంటారు. ఇదంతా ఇక్కడ కామనే, అయితే ఇప్పుడు చీరాలలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు మందుబాబులకు కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు. చీరాల మోహన్ ధియేటర్ ఎదురుగా ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు బార్ ముందు ఏకంగా ఆఫర్ల ఫ్లెక్సీలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. మా బార్‌తో మత్తుగా, చిత్తుగా తాగి 3 వేల రూపాయల బిల్లు చేస్తే లక్కీడీప్‌లో స్కూటీ, ఎల్‌ఈడి టివి, ఏసిలు బహుమతులుగా అందిస్తామంటూ బార్ ముందు బోర్డు పెట్టేశారు. ఈ నెల 2వ తేది నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ సంక్రాంతి పండుగ రోజు 15 తేదిన ముగుస్తుంది.
ఆ తరువాత 16వ తేదిన లక్కీడీప్ తీసి విజేతలకు బహుమతులు ఇస్తామని, ఎంచక్కా ఆ బహుమతులను పండుగ గిఫ్ట్ కింద ఇంటికి తీసుకెళ్ళవచ్చని దీని సారాంశం. సారా తాగి తెలుసుకున్న సారాంశం ఎలా ఉన్నా డబ్బులు ఊరికే రావు. అన్న ఓ పెద్దాయన బంగారం లాంటి మాటలు గుర్తుకు తెచ్చుకుంటే మందు ధరలు విపరీతంగా పెంచేసి వాటితోనే గిఫ్ట్‌లు ఇచ్చే దిక్కుమాలిన బార్ యజమానుల తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి మందుబాబులు ఈ గిఫ్ట్‌లకు ఆశపడి బిల్లులు ఎక్కువ చేసుకుని జేబులకు ఎంత చిల్లులు పెట్టుకుంటారో చూడాలి.
నిబంధనలు కూడా ఉన్నాయండోయ్
మందు బిల్లు 3 వేలకు పైగా ఉండాలి. డ్రా తీసే రోజు 16వ తేదిన తప్పనిసరిగా బార్‌లో ఉండాలి. గిఫ్ట్ వచ్చిన కూపన్ ఇస్తేనే బహుమతి లభిస్తుంది. ఇదీ నిబంధనల వివరాలు. మరి మందుబాబులూ పారా హుషార్.
YouTube Silver Button: యూట్యూబ్‌లో సిల్వర్ బటన్ ఎప్పుడు వస్తుంది? 10,000 వ్యూస్‌కు ఎంత డబ్బు వస్తుంది?
ఇది కూడా చదవండి: Investment Plan: 10 సంవత్సరాలలో రూ.3 కోట్లు ఎలా సంపాదించాలి? ఆశ్చర్యపోయే బెస్ట్ ట్రిక్..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




