AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Badvel by poll: టీడీపీ – వైసీపీ హోరా హోరీ పోరు.. బద్వేల్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటెదెవరు?

Badvel by poll: బద్వేల్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటెదెవరు? వరుస విజయాలతో ఊపుమీదున్న వైసీపీ బద్వేల్‌లోనూ గెలుపు మాదేనంటోంది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఈసారి సత్తా చాటుతామని ఉవ్విళ్లూరుతోంది.

Badvel by poll: టీడీపీ - వైసీపీ హోరా హోరీ పోరు.. బద్వేల్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటెదెవరు?
Badvel By Election
Balaraju Goud
|

Updated on: Sep 30, 2021 | 5:03 PM

Share

Badvel By Elections: బద్వేల్ ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటెదెవరు? వరుస విజయాలతో ఊపుమీదున్న వైసీపీ బద్వేల్‌లోనూ గెలుపు మాదేనంటోంది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఈసారి సత్తా చాటుతామని ఉవ్విళ్లూరుతోంది. కమలం కూడా ఇంచుమించు అదే ధీమాతో ఉంది. ఇంతకీ అక్కడ గెలుపెవరిది? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల పోరు.

కడప జిల్లా బద్వేల్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందడి మొదలైంది. అక్టోబర్‌ 30న పోలింగ్‌..నవంబర్‌ 2న కౌంటింగ్‌… డేట్‌ ఇప్పటికే ఫిక్సయింది. దీంతో పొలిటికల్‌ ఫైట్‌ రీసౌండ్‌ కూడా మొదలైంది. వైసీపీ నుంచి వెంకట సుబ్బయ్య భార్య డా.సుధ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఓబుళాపురం రాజశేఖర్‌ బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ మాత్రం జనసేనతో చర్చించి అభ్యర్థిని ఫైనల్ చేసే పనిలో పడింది.

బద్వేల్ నియోజకవర్గానికి ఇప్పటిదాకా 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌- 6, టీడీపీ-4 , వైసీపీ- 2 సార్లు విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ వెంకట సుబ్బయ్య 61 శాతం ఓట్లు సాధించారు. ఈసారి ఈక్వేషన్స్‌ ఎలా ఉంటాయన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహం మీదున్న వైసీపీ.. బద్వేల్‌లోనూ అలవోకగా విజయం సాధిస్తామన్న కాన్ఫిడెంట్‌తో ఉంది.

వైసీపీ అభ్యర్థి దాసరి సుధాతో పాటు కడపజిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ముఖ్య నాయకులకు అదిస్థానం నుంచి పిలుపొచ్చింది. ఉప ఎన్నిక బాధ్యతలు, ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ పై జిల్లా నేతలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. సిట్యువేషన్‌ చూస్తుంటే బద్వేల్‌లో గెలుపును అధికార పార్టీ సీరియస్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది.

ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎలాగైనా గెలిచి నిలవాలని కంకణం కట్టుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలని భావిస్తోంది. ఇక బీజేపీ-జనసేన కాంబినేషన్‌ కూడా విజయంపై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ఎంతమేర ప్రభావం చూపిస్తాయన్నది చూడాలి.

బద్వేల్‌ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలున్నాయి. ఓటర్ల సంఖ్య 2 లక్షల 4 వేల 614 మంది. వాళ్లంతా ఎవరిని ఆదరిస్తారు? వార్‌ వన్‌సైడ్ అన్నట్టుగా సుధా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఖాయమేనా? లేదంటే సైకిల్‌ నూతనోత్సాహంతో పరుగులు పెడుతుందా అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు బైపోల్‌తో అధికార యంత్రాంగం అలర్టయింది. జిల్లా వ్యాప్తంగా 23 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది.

Read Also… Punjab Crisis: రాజకీయ సంక్షోభంలో పంజాబ్ కాంగ్రెస్.. మరికాసేపట్లో సీఎం చరణ్‌జీత్‌ సింగ్‌‌తో సిద్ధూ భేటీ