AP Covid 19 Cases: ఏపీలో కాస్త పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 1,010 మందికి పాజిటివ్.. 13 మంది మృతి
AP Coronavirus Cases today updates: గత కొన్ని రోజులుగా తక్కువ కరోనా కేసులు నమోదు అయిన ఆంధ్రప్రదేశ్‌లో మరోసారిగా కరోనా కేసులు పెరగడం కలవరానికి గురిచేస్తోంది.
Andhra Pradesh Coronavirus Cases: గత కొన్ని రోజులుగా తక్కువ కరోనా కేసులు నమోదు అయిన ఆంధ్రప్రదేశ్‌లో మరోసారిగా కరోనా కేసులు పెరగడం కలవరానికి గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో 58,054 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,010 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,50,324కు చేరుకుంది. ఇక, నిన్న ఒక్కరోజే 13 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారిన పడి 14,176 మృత్యువాతపడ్డారు.
ఇక, కరోనా రాకాసి జయించి నిన్న 1,149 మంది కోలుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,24,645కు చేరిందిజ రాష్ట్రంలో ప్రస్తుతం 11,503 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కడప, కృష్ణా, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 2,82,93,704 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
వివిధ జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి….