హైదరాబాద్‌ టీంలో ఆయన కెరీర్ ముగిసినట్లేనా.. ఆసీస్ మాజీలకు ఎందుకంత కోపం.. ఎస్‌ఆర్‌హెచ్, వార్నర్‌ మధ్యలో అసలేం జరుగుతోంది..?

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నుంచి మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పూర్తిగా తప్పుకున్నట్లేనా. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ నాయకుడిగా ఉన్న డేవిడ్ వార్నర్..

హైదరాబాద్‌ టీంలో ఆయన కెరీర్ ముగిసినట్లేనా.. ఆసీస్ మాజీలకు ఎందుకంత కోపం.. ఎస్‌ఆర్‌హెచ్, వార్నర్‌ మధ్యలో అసలేం జరుగుతోంది..?
David Warner
Follow us

|

Updated on: Sep 30, 2021 | 5:14 PM

David Warner: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం నుంచి మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పూర్తిగా తప్పుకున్నట్లేనా. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ నాయకుడిగా ఉన్న డేవిడ్ వార్నర్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపించకపోవడమే ఇందుకు బలం చేకూర్చుతుందని అంటున్నారు. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ తరుపున అత్యధిక స్కోరర్ అయిన వార్నర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోవడంతో అటు మీడియాలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం కూడా ఉంది. ఇన్‌స్టా వేదికగా ఆయన చేసిన ప్రకటన అభిమానులను షాక్ కు గురి చేసింది. “దురదృష్టవశాత్తు, మళ్లీ (స్టేడియంలో) రాను, కానీ, మద్దతు మాత్రం ఇస్తూనే ఉండండి,” అని వార్నర్ పేర్కొవడం పెద్ద ప్రశ్నగా మారింది.

వార్నర్ కెరీర్ ముగింపు దశకు వచ్చిందా.. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరపున డేవిడ్ వార్నర్ ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. కానీ, నేడు ఆ టీం నుంచి ఆయన కెరీర్ ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున తన చివరి మ్యాచ్ ఆడినట్లు సూచించాడు. ఐపీఎల్ 2021 లో ఆస్ట్రేలియన్ ఓపెనర్ అధ్వాన్న స్థితిలో ఉన్నాడు. పరుగులు చేయడంలో తెగ ఇబ్బంది పడుతున్నాడు. కేన్స్ విలియమ్సన్ కెప్టెన్‌గా నియమించిన తరువాత వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయింగ్ XI నుంచి తప్పించారు. ఐపీఎల్ చరిత్రలో ఎస్‌ఆర్‌హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ పలు రికార్డులు నెలకొల్పాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌లో కీలకమైన వ్యక్తి.. వార్నర్ కెప్టెన్సీలో ఎస్‌ఆర్‌హెచ్ టీం ఎన్నో కఠినమైన సీజన్లను ఆడింది. అలాగే ట్రోఫీ-విజేతగా ప్రచారంలోనూ అభిమానులు ఎల్లప్పుడూ డేవిడ్ వార్నర్‌తో బాగా కనెక్ట్ అయ్యేవారు. 34 ఏళ్ల వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్ బృందంలో ఓ అతిపెద్ద ఆస్తి. ఆయనతోపాటు రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కేన్ విలియమ్సన్ లాంటి అనేక మంది ఉన్నారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులతో ఎల్లప్పుడూ టచ్‌లో ఉండడంలో మాత్రం డేవిడ్ వార్నర్‌ది ప్రత్యేకమైన శైలి. తెలుగులో ట్వీట్లు చేస్తూ.. తెలుగు పాటలకు డ్యాన్సులు వేస్తూ ఆయన ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచేవాడు.

ఫాంలేమికి తోడు పరాజయాలు.. ఐపీఎల్‌ 2021లో వార్నర్ అస్సలు ఫాంలో లేడు. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 24.37 సగటుతో కేవలం 181 పరుగులు మాత్రమే చేశాడు. ఈ దశలో వార్నర్ స్ట్రైక్ రేట్ 107.73గా నమోదైంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని ఐపీఎల్ సీజనల్లో కంటే ఈ 2021 సీజన్‌లోనే అతి తక్కువ పరుగులు సాధించాడు. అయితే ప్రతీ ఆటగాడికి ఇలాంటి దశ ఒకటి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎంతో ఓర్పుగా ఉండాల్సి వస్తుంది. ఫాంలో లేని సమయంలో జట్టు నుంచి వేటు కూడా పడొచ్చు. అయితే వార్నర్ విషయంలో హైదరాబాద్ టీం మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరును అంతా తప్పుబడుతున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు ఆయన ఎన్నో సేవలు అందించాడంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాపోతున్నారు. మరలా అద్భుతమైన ఫాంతో తిరిగిరావాలంటూ కూడా వార్నర్‌కు సూచించారు.

కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ మాజీల పిలుపు భారతదేశంలో జరిగిన ఐపీఎల్ 2021 తొలి దశలో పేలవమైన ప్రారంభం తరవాత, ప్రముఖ ఆసీస్ కోచ్‌లు టామ్ మూడీ, ట్రెవర్ బేలిన్, బ్రాడ్ హాడిన్‌లు డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలంటూ మేనేజ్‌మెంట్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టన్సీ నుంచి డేవిడ్ వార్నర్‌ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ఎంపిక చేశారు.

మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకేనా.. భారతదేశంలో జరిగిన ఐపీఎల్ 2021 ప్రథమార్ధంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి మనీష్ పాండేను మినహాయించడంపై వార్నర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీంతో అప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఒక విజయం మాత్రమే దక్కడంతో.. వార్నర్ స్థానాన్ని మరితం కష్టతరం చేసింది. ఆ సమయంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కోసం కష్టపడుతున్న కేన్ విలియమ్సన్, జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కెప్టెన్ మారినా ఎస్‌ఆర్‌హెచ్ జాతకం మాత్రం మారలేదు. కేన్ నాయకత్వంలో మూడు మ్యాచులాడిన ఎస్‌ఆర్‌హెచ్ టీం కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. వార్నర్ ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూకుడైన ఆటగాడు. అటు ఆస్ట్రేలియాకే కాదు.. ఇటు ఐపీఎల్‌లోనూ తన బ్యాటుతో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించేవాడు. అందుకు ఆయన గణాంకాలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

గతమెంతో ఘనం..హైదరాబాద్ తరపున డేవిడ్ వార్నర్ 2014లో 14 మ్యాచులు ఆడిన వార్నర్ 140 స్ట్రైక్ రేటుతో 528 పరుగులు సాధించాడు. అలాగే 2015లో 156 స్ట్రైక్ రేట్‌తో 562 పరుగులు సాధించాడు. ఇక 2016లో 17 మ్యాచులు ఆడిన వార్నర్ 151 సగటుతో 848 పరుగులు చేశాడు. అలా 2020 వరకు 500 కంటే ఎక్కువ పరుగులు సాధిస్తూ వస్తున్నాడు. కానీ, 2021లో మాత్రం ఫాంలో లేక తంటాలు పడుతోన్న వార్నర్ కేవలం 8 మ్యాచుల్లో 107 స్ట్రైక్ రేట్‌తో 195 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో వార్నర్ ఐదో స్థానంలో నిలిచాడు.

ప్లేయింగ్‌ XIలో లేకపోవడంతో ఫీలయ్యాడా? పేలవమైన ఫామ్ కారణంగా ఏ ఆటగాడినైనా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించే అవకాశం మేనేజ్‌మెంట్‌కు ఉంటుంది. ఎస్‌ఆర్‌హెచ్‌లోనూ అలాగే జరిగింది. గత మ్యాచులో వార్నర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోవడంతో హోటల్‌లోనే గడిపినట్లు తెలుస్తుంది. అయితే మొదటి దశలోనూ ప్లేయింగ్‌ ఎలెవన్‌లోనూ చోటు దక్కకపోవడంతో వార్నర్ ఆట మధ్యలో ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకువెళ్లి మ్యాచు విషయాలు చర్చించాడు. కానీ, ఈ సారి మాత్రం అలా జరగలేదు. మేనేజ్‌మెంట్‌కు వార్నర్‌కు మధ్యలో ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఐసీఎల్‌ నుంచి అసలే తప్పుకుంటాడా లేదా.. వేరే ప్రాంచైజీకి వెళ్తాడా అనేది తెలియదు.

సోషల్ మీడియాలో తగ్గేదేలే.. రాజస్థాన్‌పై మ్యాచ్‌లో వార్నర్ ప్లేస్‌లో తొలిసారి బరిలోకి దిగిన జేసన్ రాయ్‌.. హాఫ్ సెంచరీతో ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో వార్నర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా జేసన్ రాయ్‌ని ప్రత్యేకించి ప్రశంసించారు.

Also Read: Ashwin: నిజంగా ఆ విషయం తెలియదు.. ఏం చేసినా జట్టు కోసమే.. మోర్గాన్‎తో గొడవపై వరుస ట్వీట్లు..

IPL 2021: ‎ఐపీఎల్‌లో ఇప్పటికీ ఆయనే అత్యంత విలువైన ఆటగాడు: మ్యాథ్యూ హేడెన్

భారత హాకీ ప్లేయర్‌కు కొత్త తలనొప్పి.. నేను ఆయనను కాదు.. నన్ను ట్రోల్ చేయవద్దంటూ వేడుకోలు

Latest Articles
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
NEET UG పరీక్ష హాల్‌లో ఓ విద్యార్ధి తత్తరపాటు..అనుమానంతో ఆరాతీయగా
NEET UG పరీక్ష హాల్‌లో ఓ విద్యార్ధి తత్తరపాటు..అనుమానంతో ఆరాతీయగా
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..