Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 World Cup 2021: పాకిస్తాన్ టార్గెట్ ఆయనే.. విరాట్ కోహ్లీని లైట్ తీసుకోవడమే బెటరంటోన్న పాక్ మాజీ క్రికెటర్

2021 టీ 20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 24 న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అంతకుముందు, 2016 టీ 20 ప్రపంచకప్‌లోనూ ఇరు జట్లు తలపడ్డాయి. ఇందులో కోహ్లీ హాఫ్ సెంచరీతో భారత్ గెలిచింది.

ICC T20 World Cup 2021: పాకిస్తాన్ టార్గెట్ ఆయనే.. విరాట్ కోహ్లీని లైట్ తీసుకోవడమే బెటరంటోన్న పాక్ మాజీ క్రికెటర్
T20 World Cup
Follow us
Venkata Chari

|

Updated on: Sep 30, 2021 | 5:55 PM

T20 World Cup: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021కు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. టోర్నమెంట్‌ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు అక్టోబర్ 17 నుంచి ప్రారంభమవుతాయి. టైటిల్ వేల కోసం అసలు మ్యాచులు అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 స్టేజ్‌తో ప్రారంభమవుతుంది. సూపర్ -12 స్టేజ్ ప్రారంభంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరుగుతుంది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత కఠినమైన ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? ఏ ఆటగాడు తన ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తాడు? మ్యాచ్ గమనాన్ని ఏ ఆటగాడు నిర్ణయిస్తాడు? వంటి ప్రశ్నలకు మాజీ క్రికెటర్లు సమాధానాలు ఇస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ముదాసర్ నాజర్ కూడా ఇదే విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ బాబర్ అజమ్ బృందాన్ని హెచ్చరించాడు.

టీ 20 వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్‌లు కలిసి గ్రూప్ -2 లో చోటు దక్కించుకున్నాయి. అక్టోబర్ 24 న జరిగే మ్యాచ్‌తో రెండు జట్లు టోర్నమెంట్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి. ఐసీసీ, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ టోర్నమెంట్లలో మాత్రమే పరస్పరం ఢీకొనే ఈ రెండు జట్ల మద్ధ పోరు కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా ఎదురుచూస్తున్నారు. భారత ప్రపంచ కప్ రికార్డును చూస్తే, విరాట్ కోహ్లీ జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తుందని తెలుస్తోంది. జట్టులో కెప్టెన్ కోహ్లీతో సహా చాలా మంది గొప్ప బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. కానీ ముదస్సర్ నాజర్ మాత్రం కోహ్లీని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రోహిత్ శర్మనే పాకిస్తాన్ జట్టుకు నిజమైన టార్గెట్ అని తెలిపాడు.

బలంగానే భారత్.. ఫలితం మాత్రం ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్‌లాగే.. ప్రస్తుతం టీమిండియా చాలా బలంగా ఉంది. కానీ, ఫలితం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాగా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ మాజీ బ్యాట్స్‌మెన్.. పాక్ టీంత పోల్చితే భారత జట్టు పటిష్టంగా ఉంది. కానీ, పాకిస్తాన్ టీం మాత్రం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లాగా షాక్ ఇస్తుందని తెలిపాడు.

“బలం గురించి మాట్లాడితే భారత జట్లు, పాక్ కంటే కంటే చాలా ముందుంది. పాకిస్తాన్ గెలిచిన ఛాంపియన్స్ ట్రోఫీని ఓసారి పరిశీలిస్తే.. భారత్‌తో మొదటి మ్యాచ్‌లో పాక్ జట్టు ఓడిపోయింది. రెండు జట్ల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కానీ, పాకిస్తాన్ ఆ రోజు అద్భుతంగా ఆడింది. ఈసారి కూడా అదే జరుగుతుంది” అని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపాడు.

రోహిత్ ప్రమాదకరమైన ఆటగాడు.. భారత బ్యాటింగ్ అంత బలంగా లేదని, కోహ్లీ కంటే రోహిత్ శర్మ ప్రమాదకరమని ఆయన అన్నారు. “ఇంగ్లండ్‌లో ప్రదర్శన మేరకు భారత బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. విరాట్ కోహ్లీ కూడా గత 2-3 సంవత్సరాలుగా సరైన ఫాంలో లేడు. అయితే రోహిత్ శర్మ భారతదేశానికి మరింత ప్రమాదకరమైన ఆటగాడిగా మారతాడని, టీంలతో పోల్చితే పాకిస్థాన్ కంటే భారత జట్టు చాలా మెరుగ్గా ఉందని అన్నాడు.

విరాట్ కోహ్లీ అర్థశతకంతో.. 2016 టీ 20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. అప్పుడు పాకిస్తాన్ జట్టు 18 ఓవర్ల మ్యాచ్‌లో 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్లు కేవలం 16 ఓవర్లలో విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ అజేయ అర్ధ సెంచరీ సాధించి జట్టును విజయ తీరాలకు నడిపించాడు.

Also Read: హైదరాబాద్‌ టీంలో ఆయన కెరీర్ ముగిసినట్లేనా.. ఆసీస్ మాజీలకు ఎందుకంత కోపం.. ఎస్‌ఆర్‌హెచ్, వార్నర్‌ మధ్యలో అసలేం జరుగుతోంది..?

IPL 2021: ‎ఐపీఎల్‌లో ఇప్పటికీ ఆయనే అత్యంత విలువైన ఆటగాడు: మ్యాథ్యూ హేడెన్