Andhra Pradesh: అమరావతిలో అసలేం జరిగింది..! టార్గెట్ ఎవరు.. బలైంది ఎవరు..? ఇవాళ బీజేపీ ఆందోళనలు..
వాళ్ల టార్గెట్ ఒకరు, కానీ ఎటాక్ చేసింది మాత్రం మరొకరిపై. అమరావతిలో సినిమాటిక్‌గా జరిగిన పొలిటికల్ ఎటాక్ ఇప్పుడు ఏపీలో కల్లోలం రేపుతోంది. బీజేపీ వర్సెస్ వైసీపీగా జరుగుతోన్న ఈ ఫైట్‌లో అసలు టార్గెట్ ఎవరు? బలైంది ఎవరు?. అమరావతిలో దాడి వెనక అసలేం జరిగింది?.

వాళ్ల టార్గెట్ ఒకరు, కానీ ఎటాక్ చేసింది మాత్రం మరొకరిపై. అమరావతిలో సినిమాటిక్‌గా జరిగిన పొలిటికల్ ఎటాక్ ఇప్పుడు ఏపీలో కల్లోలం రేపుతోంది. బీజేపీ వర్సెస్ వైసీపీగా జరుగుతోన్న ఈ ఫైట్‌లో అసలు టార్గెట్ ఎవరు? బలైంది ఎవరు?. అమరావతిలో దాడి వెనక అసలేం జరిగింది?. అనుకున్నదొక్కటీ-అయినది మరొక్కటని బాధపడుతోంది ఎవరు? బీజేపీ సీనియర్ లీడర్ సత్యకుమార్ కాన్వాయ్‌పై త్రీ కేపిటల్స్ మద్దతుదారులు దాడి చేయడం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. అయితే, ఈ ఎటాక్‌పై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయ్. అసలు టార్గెట్ సత్యకుమార్ కాదనే టాక్ రీసౌండ్ వస్తోంది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందనే మాట వినిపిస్తోంది. అత్యంత సినీ ఫక్కీలో జరిగిన ఈ ఎటాక్‌లో సత్యకుమార్ కారు ధ్వంసంకాగా, అతని అనుచరులను చితక్కొట్టారు త్రీ కేపిటల్స్ సపోర్టర్స్..
ఈ ఎటాక్‌పై తీవ్రంగా రియాక్టయ్యారు సత్యకుమార్. సీఎం జగన్ టార్గెట్‌గా హాట్ కామెంట్స్ చేశారు. దానికి ఘాటుగానే రిప్లై ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. మా పుట్టలో వేలు పెడితే మా కార్యకర్తలు ఊరుకుంటారా అంటూ రివర్స్ పంచ్‌లిచ్చారు. ఆందోళనకారుల అసలు టార్గెట్ ఆదినారాయణరెడ్డి. అందుకు, ఆయన చేసిన కామెంట్సే కారణం అని పేర్కొంటున్నారు.
అనుకున్నదొక్కటీ-అయినది మరొక్కటి అన్నట్టుగా అమరావతి ఎటాక్ సీన్ జరిగింది. ఆదినారాయణరెడ్డిని టార్గెట్ చేస్తే, సత్యకుమార్ బలైపోయారు. అయితే, ఈ ఇన్సిడెంట్‌ను సీరియస్‌గా తీసుకుంది బీజేపీ. యాక్షన్ తీసుకోవాలంటూ డీజీపీకి కంప్లైంట్ చేసింది. దాడికి నిరసనగా ఇవాళ స్టేట్‌వైడ్‌గా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీజేపీ.




మరిన్ని ఏపీ వార్తల కోసం..




