AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atmakur Bypoll: ప్రశాంతంగా కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌.. 11 గంటలకు ఎంత శాతం పోలింగ్‌ అంటే..

Atmakur Bypoll: మాజీ మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గురువారం ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి ఆవాంఛనీయ..

Atmakur Bypoll: ప్రశాంతంగా కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్‌.. 11 గంటలకు ఎంత శాతం పోలింగ్‌ అంటే..
Subhash Goud
|

Updated on: Jun 23, 2022 | 12:01 PM

Share

Atmakur Bypoll: మాజీ మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గురువారం ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఉదయం నుంచి కొనసాగుతున్న పోలింగ్‌లో 11 గంటల వరకు 24.92 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఉప ఎన్నికలో నియోజకవర్గం నుంచి మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ పోటీకి టీడీపీ దూరంగా ఉంది. నియోజకవర్గంలో 123 సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌కు పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సీసీటీవీ పుటేజీ ద్వారా పరిశీలిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 279 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,339 మంది జనరల్‌, 1032 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు. అంతే కాకుండా 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్‌ ఆఫీసర్స్‌ కూడా విధుల్లో ఉంటారు. మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు.

అక్కడ ఎలాంటి అల్లర్లు, ఇతర ఘటనలు జరుగకుండా ప్రత్యేక బందోబస్తును నియమించామని రిటర్నింగ్‌ ఆఫీసర్‌, జేసీ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ చెప్పారు. ఓటర్లు తప్పనిసరిగా ఓటర్‌ స్లిప్‌లతో పాటు ఓటరు ఐడీ, ఆధార్‌, బ్యాంకు పాస్ బుక్‌, పాస్‌పోర్ట్‌ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి ఉండగా, బీజేపీ తరఫున భరత్ కుమార్ పోటీలో ఉన్నారు. 26న కౌంటింగ్‌ జరుగుతుంది. 2019 ఎన్నికల్లో ఆత్మకూరులో 83.38 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఈ ఉప ఎన్నికకు ఎంత పోలింగ్‌ శాతం నమోదు అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి