AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM YS Jagan: సీఎం జగన్‌ను కలిసిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు.. ఎందుకో తెలుసా..?

CM YS Jagan: ఊహించలేనిది జరగడమే జీవితం. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల విషయంలో అదే జరిగింది. దాంతో ఆనందంలో ఉబ్బితబ్బివుతున్నారు వాళ్లంతా..

CM YS Jagan: సీఎం జగన్‌ను కలిసిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు.. ఎందుకో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Jun 23, 2022 | 10:12 AM

Share

CM YS Jagan: ఊహించలేనిది జరగడమే జీవితం. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల విషయంలో అదే జరిగింది. దాంతో ఆనందంలో ఉబ్బితబ్బివుతున్నారు వాళ్లంతా. 24ఏళ్ల తర్వాత ఉద్యోగాలు ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఏడాది కాదు, రెండేళ్లు కాదు, దాదాపు పాతికేళ్ల నిరీక్షణ వాళ్లది. పోరాడి పోరాడి అలసిపోయారు. ప్రభుత్వాలు మారాయ్‌, ముఖ్యమంత్రులూ మారారు, కానీ వాళ్ల ఆశ మాత్రం నెరవేరలేదు. ఇక, తమ కోరిన నెరవేరదని డిసైడై ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. బతకడం కోసం ఏవేవో పనులు చేశారు. కానీ, వారి జీవితంలో ఊహించలేనిది జరిగింది.1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల విషయంలో అదే జరిగింది. పరీక్ష రాసిన 24ఏళ్ల తర్వాత వాళ్ల జీవితాల్లో వెలుగులు వచ్చాయ్‌. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల సమస్యను సీఎం జగన్‌ పరిష్కరించంతో వాళ్లంతా సంతోషంలో మునిగితేలుతున్నారు.

పలు కారణాలతో ఉద్యోగాలు పొందలేకపోయిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధులకు నియామకాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో వాళ్లంతా ఆనందంతో ఉబ్బితబ్బివుతున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ను సన్మానించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్‌ నిలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధులు. 24ఏళ్లనాటి సమస్యను పరిష్కరించి తమను తమ కుటుంబాలను ఆదుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే