Maharashtra Political Crisis: ముదురుతున్న ‘మహా’ సంక్షోభం.. షిండే దెబ్బకు ఉద్ధవ్ విలవిల
Maharashtra Political Crisis: మహా సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఏక్‌నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విలవిలలాడిపోతున్నారు...
Maharashtra Political Crisis: మహా సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఏక్‌నాథ్ షిండే దెబ్బకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విలవిలలాడిపోతున్నారు. అధికార శివసేనకు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఝలక్ ఇచ్చారు. ముంబై నుంచి సూరత్ చేరుకున్నారు. ఆతర్వాత గౌహతి వెళ్లి అసమ్మతి గ్రూపులో కలిసిపోయారు ముగ్గురు తాజా రెబల్ ఎమ్మెల్యేలు. ఈ ముగ్గురితో కలిపి అసమ్మతి శివసేన ఎమ్మెల్యేల సంఖ్య 33కి చేరింది. తన వెంట ఏడుగురు ఇండిపెండెంట్లతో పాటు మొత్తం 46 మంది ఎమ్మెల్యే ఉలున్నారని, మొత్తం 55 మంది శివసేన ఎమ్మెల్యేలూ తనతో వస్తారన్న నమ్మకం ఉందని చెబుతున్నారు అసమ్మతి నేత ఏక్‌నాథ్ షిండే. ఇక కాసేపట్లో సీనియర్ నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు సీఎం ఉథ్థవ్ థాక్రే. తదుపరి కార్యాచరణపై ఓ నిర్ణయానికొచ్చే ఆస్కారం ఉంది. కూటమి పార్టీ ఎన్సీపీ కూడా తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించబోతోంది.
నిన్న రాత్రి అకస్మాత్తుగా తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే. కుటుంబ సమేతంగా సొంతిల్లు మాతోశ్రీకి వెళ్లిపోయారు. సిబ్బంది సాయంతో సామానంతా కార్లలో తరలించారు. ఉథ్థవ్ థాక్రే క్యాంపాఫీసు ఖాళీ చేసే సమయంలో… భారీ సంఖ్యలో చేరుకున్నారు శివ సైనికులు. వెళ్లొద్దంటూ కార్యకర్తలు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఉథ్థవ్ తనయుడు ఆదిత్య థాకరే కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఫేస్‌బుక్ లైవ్ ద్వారా సీఎం ఉథ్థవ్ థాక్రే ఇచ్చిన స్పీచ్ బూమరాంగ్ అయినట్టు తెలుస్తోంది. పొమ్మంటే ఇప్పుడే పోతా అనే స్టేట్‌మెంట్‌పై విమర్శలొస్తున్నాయి. కార్యకర్తల్లో ఉత్తేజం నింపలేకపోగా, మిగతా ఎమ్మెల్యేల్ని కూడా రెబల్స్‌గా మార్చారని కార్నర్ చేస్తున్నారు.
అటు.. మహా సంక్షోభాన్ని నివారించడానికి అత్యవసరంగా సమావేశమైంది అధికార సంకీర్ణ కూటమి మహావికాస్ అఘాడీ. రెబల్ నేత షిండేను సీఎం అభ్యర్థిగా ప్రకటించడమొక్కటే ఇప్పుడున్న మార్గమని ఉథ్థవ్‌కి సలహా ఇచ్చారు శరద్ పవార్. శివసేన అధికార పత్రిక సామ్నాలో షిండే తిరుగుబాటుపై తీవ్ర వ్యాఖ్యలతో కథనం వచ్చింది. శివసేన టిక్కెట్ మీద ఎన్నికైన ఎమ్మెల్యేలు అడ్డం తిరిగితే… వచ్చే ఎన్నికల్లో శివసైనికులు గట్టిగా బుద్ధి చెబుతారని, తర్వాత అంతా సర్దుకుంటుందని, శివసేనకు పూర్వ వైభవం వస్తుందని ఆ కథనంలో రాశారు.
56 ఏళ్ల శివసేన చరిత్రలో ఇది నాలుగో తిరుగుబాటు. గతంలో భుజ్‌బల్, రాణే, ఠాక్రే… ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే. ఇప్పుడు ఉథ్థవ్ సర్కార్ కూలిపోవడం ఖాయమని, మేజిక్ ఫిగర్ 144 చేరుకుని, బీజేపీతో కలిసి షిండే నేతృత్వంతో ప్రభుత్వం ఏర్పాటవుతుందని క్లియర్ సిగ్నల్స్ ఉన్నాయి.
ఎవరికి ఎంత బలం..
ఉద్ధవ్‌కు మద్దతుగా..
☛ శివసేన – 14
☛ ఎన్సీపీ -53
☛ కాంగ్రెస్ -44
☛ స్వతంత్రులు -00
☛ ఇతరులు -09
మొత్తం- 120
బీజేపీ మద్దతుగా..
☛ బీజేపీ -106
☛ శివసేన రెబల్స్ -41
☛ ఎంఎన్‌ఎస్ -01
☛ స్వతంత్రులు -13
☛ ఇతరులు -06
మొత్తం – 167
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి