Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి కోసం స్పెషల్‌ బస్సులు.. పూర్తి వివరాలివే..

సంక్రాంతి పండగకు స్వస్థలాలకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపిందుకు సిద్ధమైంది.

APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి కోసం స్పెషల్‌ బస్సులు.. పూర్తి వివరాలివే..
Follow us
Basha Shek

|

Updated on: Dec 26, 2021 | 8:19 AM

సంక్రాంతి పండగకు స్వస్థలాలకు వెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపిందుకు సిద్ధమైంది. పండగ ముందు, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి, అలాగే రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల మధ్య ఈ స్పెషల్‌ బస్సులు తిరగనున్నాయి. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ బస్సుల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఏపీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ముందస్తు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

బస్సుల వివరాలు ఇవే.. స్పెషల్‌ సర్వీసుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 1,500 బస్సులు వరకు సిద్ధం చేసింది ఆర్టీసీ. జనవరి 7 నుంచి 14 వరకు ఈ బస్సులు నడుస్తాయి. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయల్దేరతాయి. ఏపీఎస్ ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ నుంచి కూడా 1,266 ప్రత్యేక బస్సులు తిరగనున్నాయి. ఇందులో హైదరాబాద్‌కు 362, విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, చెన్నైకి 20, బెంగళూరుకు 14, ఇతర ప్రాంతాలకు 120 బస్సులు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్ని స్పెషల్‌ సర్వీసులు ఏర్పాటుచేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక పండగ తర్వాత తిరుగు ప్రయాణికుల కోసం 16 నుంచి హైదరాబాద్‌కు కూడా స్పెషల్ సర్వీసులు కూడా ఏర్పాటు చేశారు.

రోజూ 400కు పైగా బస్సులు.. కాగా సంక్రాంతి సందర్భంగా జనవరి 7 నుంచి 14 మధ్య ఇప్పటికే రైళ్లు, బస్సుల్లో బెర్తులు, సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకొనే విజయవాడ, గోదావరి జిల్లాలు, విశాఖ మార్గాల్లో రైళ్లు, బస్సులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. విజయవాడ- విశాఖపట్నం మార్గాల్లో అయితే ఇప్పటికే రెగ్యులర్‌ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ నుంచి రాష్ట్రంలోని వివిధ దూరప్రాంతాలకు రోజూ 400కుపైగా బస్సులు నడుస్తున్నాయి. వీటిలో కూడా జనవరి 8–14 మధ్య అధిక శాతం సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయి. కాగా రెగ్యులర్‌ బస్సుల్లో సీట్లు నిండాకే స్పెషల్‌ సర్వీసులకు రిజర్వేషన్లు చేసుకునే అవకాశం ఉంది.

Bigg Boss 5 Telugu: వెండితెరకు పరిచయం కానున్న మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. సినిమా పోస్టర్‌ విడుదల..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Vishal’s Saamanyudu : మరోయాక్షన్ ఎంటర్టైనర్‌తో రానున్న విశాల్.. ఆకట్టుకుంటున్న ‘సామాన్యుడు’ టీజర్..