Vishal’s Saamanyudu : మరోయాక్షన్ ఎంటర్టైనర్‌తో రానున్న విశాల్.. ఆకట్టుకుంటున్న ‘సామాన్యుడు’ టీజర్..

విశాల్ తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక విశాల్ నయించిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి.

Vishal's Saamanyudu : మరోయాక్షన్ ఎంటర్టైనర్‌తో రానున్న విశాల్.. ఆకట్టుకుంటున్న 'సామాన్యుడు' టీజర్..
Vishal
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 26, 2021 | 8:00 AM

Vishal’s Samanyudu : విశాల్ తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక విశాల్ నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే రిలీజ్ అయినా ఎనిమి సినిమా కూడా తెలుగులో మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సామాన్యుడిగా రానున్నాడు. విశాల్ ‘సామాన్యుడు’ చిత్రంతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు.. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు.. ఇంకొకరుఆ సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు.. ఆ రాక్షసుల తల రాతని మార్చి రాయాల్సిన పరిస్థితి ఒక రోజు ఓ సామాన్యుడికి వస్తుంది’ అనే డైలాగ్‌తో టీజర్ సాగుతుంది. టీజర్‌ను బట్టి చూస్తే ఫుల్ యాక్షన్ మోడ్‌లో సినిమా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇలాంటి పాత్రల్లో నటించడం విశాల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇక డింపుల్ హయతి అందంగా కనిపించారు. కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా కుదిరాయి. ఇక యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: వెండితెరకు పరిచయం కానున్న మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. సినిమా పోస్టర్‌ విడుదల..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Viral Video: మరోసారి అదరగొట్టిన నైనిక, తనయ.. ఈసారి ‘సామి సామి’ అంటూ నెటిజన్లను కట్టిపడేశారు..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!