Tenth Students: ఏపీ టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌.. పరీక్ష సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

అన్ని పల్లె వెలుగు, సిటీ ఆర్జినరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది. బస్సు పాస్‌ లేకున్నా.. హాల్‌ టికెట్‌ చూపించి విద్యార్థులు ఉచితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. పరీక్ష పూర్తి అయిన అనంతరం విద్యార్థి తిరిగి తమ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు అని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.

Tenth Students: ఏపీ టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌.. పరీక్ష సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
Ap Tenth Students
Follow us

|

Updated on: Mar 24, 2023 | 6:45 AM

పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఏపీఎస్‌ఆర్టీసీ. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్‌ 3నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ  నేపథ్యంలో టెన్త్ స్టూడెంట్స్ కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చునని ప్రకటించింది. అన్ని పల్లె వెలుగు, సిటీ ఆర్జినరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది. బస్సు పాస్‌ లేకున్నా.. హాల్‌ టికెట్‌ చూపించి విద్యార్థులు ఉచితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చు. పరీక్ష పూర్తి అయిన అనంతరం విద్యార్థి తిరిగి తమ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు అని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పరీక్షల సమయంలో ఈ అవకాశం ఉంటుందని పేర్కొంది. మరోవైపు..

పరీక్షల సమయంలో విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను సిద్ధం చేస్తోంది ఏపీఎస్‌ఆర్టీసీ. హాల్ టిక్కెట్ ఉంటే చాలు అనుమతించాలని ఆర్టీసీ సిబ్బందికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానంద రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 6 లక్షల 50 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..