Kurnool: వైభవంగా వల్లెలాంబ సరస్వతి దేవి జాతర.. హోరాహోరీగా తలపడిన పొట్టేళ్లు..
గెలుపు నీదా? నాదా? అన్నట్లు పోటీపడ్డాయి. తమ పొట్టేలే గెలువాలన్నట్లుగా వాటిని ఉసిగొలిపారు యజమానులు. జనం కేకలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. జనం పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ వల్లెలాంబ సరస్వతి దేవి జాతర అంగరంగ వైభవంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా జరిగిన పొట్టేళ్ల పోటీలు పోటీలు హోరా హోరీగా సాగాయి. పొట్టేళ్ల పందాలను జిల్లా నలుమూలల నుంచి జనం భారీగా తరలివచ్చి పోటీలను ఆసక్తిగా తిలకించారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పొట్టేళ్లు బరిలోకి దిగాయి. ఈలలు, కేకలు వేస్తూ జనం వాటిని ప్రత్యర్థిపైకి ఉసిగొలిపారు. పొట్టేళ్లు సైతం గెలుపు లక్ష్యంగా గ్రౌండ్‌లో కాలు దువ్వుతూ తలపడ్డాయి.
గెలుపు నీదా? నాదా? అన్నట్లు పోటీపడ్డాయి. తమ పొట్టేలే గెలువాలన్నట్లుగా వాటిని ఉసిగొలిపారు యజమానులు. జనం కేకలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. జనం పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా సెక్యూరిటీ కల్పించారు. పోటీలలో గెలుపొందిన పొట్టేళ్ల యజమానులకు బహుమతులను ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాభ్యాసం జరిగే ఏకైక ప్రసిద్ధ సరస్వతీ దేవాలయం ఇదే. ఈ దేవాలయం నల్లమల్ల అడవిలో ఉంది. సరస్వతి దేవిని జ్ఞాన దేవతగా భావిస్తారు. చాలా మంది ప్రజలు తమ పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
