AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నేను చనిపోతా అనుమతివ్వండి సార్.. స్పందన కార్యక్రమంలో బాధితుడి దరఖాస్తు

కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి అంటూ గుంటూరు కలెక్టర్ స్పందన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ బిల్లులు మంజూరు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితుడు హరికిషన్ వాపోయాడు.

Andhra Pradesh: నేను చనిపోతా అనుమతివ్వండి సార్.. స్పందన కార్యక్రమంలో బాధితుడి దరఖాస్తు
Spandhana Program
Aravind B
|

Updated on: Jun 05, 2023 | 1:39 PM

Share

కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలి అంటూ గుంటూరు కలెక్టర్ స్పందన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. హార్టికల్చర్ కమిషనర్ శ్రీధర్ బిల్లులు మంజూరు చేయకుండా వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితుడు హరికిషన్ వాపోయాడు. తనకి రావాల్సిన 11 లక్షల రూపాయల బకాయిలు ఇప్పించాలని కలెక్టర్ కు పెట్టుకున్న దరఖాస్తులో విజ్ఞప్తి చేశాడు. ఒకవేళ తనకు రావాల్సిన బకాయి డబ్బులు రాకపోతే.. మరణమే శరణ్యమంటూ కన్నీరు మున్నీరుగా కలెక్టరేట్ దగ్గర తన ఆవేదన వ్యక్తం చేశాడు.

తన సమస్యను పరిష్కరించాలని ఎన్నోసార్లు మంత్రి కార్యాలయం నుంచి హార్టికల్చర్ కమిషనర్‌ శ్రీధర్‌కు ఫోన్లు చేయించినా కూడా ఆయన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నిధులు మంజూరు కోసం రాజమండ్రి కలెక్టర్ చెప్పినప్పటికీ కూడా కలెక్టర్ ఆదేశాలను కమిషనర్ బేఖాతరు చేశారని వాపోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే వ్యవసాయ శాఖలో ఎలక్ట్రికల్ ఆటోల అవసరం ఉంటుంది. అయితే వీటిని హార్టికల్చర్ శాఖ సమకూరుస్తుంది. దీనిలో భాగంగా.. వ్యవసాయ శాఖకు మూడు ఎలక్ట్రికల్ ఆటోలను సప్లై చేశానని చెప్పాడు హరికిషన్. దీనికింద 11 లక్షల రూపాయల బకాయి నిధులు రావాల్సి ఉన్నాయన్నారు. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కి చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు