ప్రతిపక్షాలతో చెడుగుడు.. ఫన్ కోసం కబడ్డీ.. ఏ ఆటలోనైనా తగ్గేది లేదంటున్న ఎమ్మెల్యే రోజా.. హల్‌చల్ చేస్తోన్న వీడియో..

APIIC Chairman and MLA Roja: తెలుగు రాష్ట్రాల్లో రోజా అంటే తెలియని వారుండరు. తొలుత నటిగా మంచి గుర్తింపు..

  • Shiva Prajapati
  • Publish Date - 7:39 pm, Sun, 7 March 21
ప్రతిపక్షాలతో చెడుగుడు.. ఫన్ కోసం కబడ్డీ.. ఏ ఆటలోనైనా తగ్గేది లేదంటున్న ఎమ్మెల్యే రోజా.. హల్‌చల్ చేస్తోన్న వీడియో..

APIIC Chairman and MLA Roja: తెలుగు రాష్ట్రాల్లో రోజా అంటే తెలియని వారుండరు. తొలుత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తరువాత రాజకీయ నాయకురాలిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు.. విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఆమెది ప్రముఖ స్థానం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట నడిచే ముఖ్యమైన నాయకులలో ఆమె కూడా ఒకరు. నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. ఏపీఐఐసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పదవి కేబినెట్ మినిస్టర్‌తో సమానం. ఇలా ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్మన్‌గా, రాజకీయ నాయకురాలిగా బిజీ బిజీగా గడిపే ఆమె.. కాసేపు అవన్నీ పక్కన పెట్టేశారు. తనకు ఇష్టమైన కబడ్డీ ఆటను ఆడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆదివారం నాడు నగరి నియోజకవర్గం పరిధిలో గల నిండ్రలో కబడ్జీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోజా అక్కడికి వెళ్లారు. అయితే, చిన్ననాటి నుంచే కబడ్జీ పట్ల ఆసక్తి ఉన్న రోజా.. ఆటగాళ్లతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. గ్రౌండ్‌లోకి ఎంటరై.. కబడ్డి.. కబడ్డి అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లను పరుగులు పెట్టించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా.. కబడ్డీ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పారు. స్కూల్ రోజులు బాగా ఆడేదానని అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల టెన్షన్‌లో ఉన్న తాను రిలాక్సేషన్ కోసమే కబడ్డీ ఆడుతున్నానని పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే రోజా ప్రచారం నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాస్త ఆటవిడుపు కోసం ఇవాళ ఆమె కబడ్జీ ఆడి సందడి చేశారు.

Also read: హృదయ విదారక ఘటన.. 13 ఏళ్ల కొడుకు మృతదేహంతో 3 కిలోమీటర్లు నడిచిన తండ్రి.. పోలీసుల ప్రేక్షక పాత్ర

చంద్రబాబు కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చిన పోసాని .. జగన్ ఏ విధంగా ఫేక్ ముఖ్యమంత్రి అయ్యాడో నిరూపించాలని వ్యాఖ్య..

భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!