చంద్రబాబు కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చిన పోసాని .. జగన్ ఏ విధంగా ఫేక్ ముఖ్యమంత్రి అయ్యాడో నిరూపించాలని వ్యాఖ్య..

Posani Krishnamurali : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

  • uppula Raju
  • Publish Date - 6:24 pm, Sun, 7 March 21
చంద్రబాబు కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చిన పోసాని .. జగన్ ఏ విధంగా ఫేక్ ముఖ్యమంత్రి అయ్యాడో నిరూపించాలని వ్యాఖ్య..

Posani Krishnamurali : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై నటుడు పోసాని కృష్ణమురళి ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు మైండ్ లేదని అనవసరంగా జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేపట్టారు.. పంచాయతీ ఎన్నికల్లో చెప్పింది చేశారు అందుకే ప్రజలు గుర్తించి అఖండ విజయాన్ని అందించారని అన్నారు.

మున్సిపల్ ఎన్నికలలో కూడా వైస్సార్సీపీ పార్టీని ప్రజలు గెలిపించాలని తాను కోరుకుంటున్నట్లు ప్రకటించారు. జగన్ ఫేక్ ముఖ్యమంత్రి అంటున్న చంద్రబాబు ఎలా ఫేక్ అయ్యాడో నిరూపించాలని బహిరంగంగా సవాల్ విసిరారు. ఇచ్చిన ప్రతి హామీని, మాట తప్పకుండా చేస్తున్న సీఎంని ఫేక్ ఎలా అంటారని ప్రశ్నించారు. మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని రౌడీ అంటారని ఎద్దేవా చేశారు. ఎమ్మార్వో వనజాక్షి పై దాడి చేసినా ఖండించని వ్యక్తిని ఫేక్ అంటారని ఎగతాళి చేశారు. చంద్రబాబు పులివెందులలో రౌడీ రాజ్యం నడుస్తుంది.. అన్ని అసత్యాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఒక్కసారి అక్కడికి వెళ్లి ఏం జరుగుతుందో చూడండని బదులిచ్చారు.

ఇదిలా ఉంటే.. చంద్రబాబుపై ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు కుల పిచ్చి పట్టుకుందని దుయ్యబట్టారు. ఆ ట్రాన్స్ నుంచి చంద్రబాబు బయటకు రావాలని హితవు చెప్పారు. బాబు తన నైజం మార్చుకోకపోతే ప్రజలే బడిత పూజ చేస్తారని వ్యాఖ్యానించారు. ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. చంద్రబాబు టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాగా జగన్‌కు కుల పిచ్చి లేదన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన నేతలకే విజయవాడ, గుంటూరు మేయర్ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారని మంత్రి విమర్శించారు. మేయర్ చేయగల సమర్థత టీడీపీ జెండా మోసిన కార్యకర్తకి లేదా? అని చంద్రబాబును మంత్రి ప్రశ్నించారు. అసలు రాజకీయాల్లో డబ్బు జబ్బు అంటించిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.

CM KCR : మహిళా ఉద్యోగులకు ఒక్క రోజు సెలవు.. ఉమెన్స్ డే సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..