హృదయ విదారక ఘటన.. 13 ఏళ్ల కొడుకు మృతదేహంతో 3 కిలోమీటర్లు నడిచిన తండ్రి.. పోలీసుల ప్రేక్షక పాత్ర

ప్రపంచంలో మానవత్వం కంటే గొప్పది ఏదీ లేదని అందరూ చెబుతారు. కానీ, చాలా సార్లు ఆ సమయం వచ్చినప్పడు ప్రజలు మానవత్వం చూపించడం మరిచిపోతారు.

హృదయ విదారక ఘటన.. 13 ఏళ్ల కొడుకు మృతదేహంతో 3 కిలోమీటర్లు నడిచిన తండ్రి.. పోలీసుల ప్రేక్షక పాత్ర
Follow us

|

Updated on: Mar 07, 2021 | 6:50 PM

ప్రపంచంలో మానవత్వం కంటే గొప్పది ఏదీ లేదని అందరూ చెబుతారు. కానీ, చాలా సార్లు ఆ సమయం వచ్చినప్పడు ప్రజలు మానవత్వం చూపించడం మరిచిపోతారు. బీహార్‌లోని కతిహార్‌లో తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన 13 ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని ఒక ముతక బస్తాలో వేసుకుని మూడు కిలోమీటర్ల దూరం నడిచాడు. ఈ పరిస్థితుల్లో ఎవరూ అతనికి సహాయం చేయలేదు. పోలీసులు కూడా కనీస మానవత్వం లేకుండా వ్యవరించారు. పూర్తి వివరాలు తెలిస్తే.. మీ హృదయం నిజంగా కన్నీరు పెడుతుంది.

అందుతోన్న సమాచారం ప్రకారం… భాగల్పూర్‌లో నీరు యాదవ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని 13 ఏళ్ల కుమారుడు హరియోమ్ యాదవ్ తీర్థంగ గ్రామం వద్ద పడవలో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. ఆ తరువాత అతను కనిపించలేదు. ఈ విషయంపై నీరు యాదవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తరువాత, కరీహార్లోని కుర్సోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఖేరియా నది సమీపంలో హరియోమ్ యాదవ్ మృతదేహం లభ్యమైంది. డెడ్‌బాడీ గురించి నీరు యాదవ్‌కు సమాచారం ఇచ్చారు పోలీసులు. అతను సంఘటన స్థలానికి చేరుకుని చూడగా మృతదేహం గుర్తుపట్టలేనివిధంగా మారిపోయింది. జంతువులు అతని మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. అయితే, వేసుకున్న బట్టలతో పాటు ఇతర శరీర భాగాల ఆధారంగా మృతదేహం తన కుమారుడిదే అని గుర్తించాడు నీరు యాదవ్.

‘ఎవరూ సానుభూతి చూపలేదు’

ఆశ్చర్యకరంగా, ఈ విషయంలో భారుపూర్ పోలీసులు కానీ, కతిహార్ పోలీసులు నీరు యాదవ్ కనీసం మానవం చూపలేదు. మృతదేేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ కూడా అందించలేదు. దీంతో చేసేదేం లేక నీరు యాదవ్ కొడుకు మృతదేహాన్ని ఒక గోనె సంచిలో వేసి..  సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటివరకు నడుచుకుంటూ వెళ్లాడు.  “ఎవరూ నాకు సహాయం చేయలేదు, కనీసం సానుభూతి చూపలేదు” అని నీరు యాదవ్ చెప్పారు. ఈ సంఘటన మరోసారి ‘మానవత్వం’ పై ప్రపంచానికి ప్రశ్నలు సంధించింది.

Also Read:

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు

ఈ వ్యక్తి 32 ఏళ్లగా కేవలం రాళ్లు మాత్రమే తిని జీవిస్తున్నాడు.. రోజుకో పావు కేజీ