Betel Leaf: ఆరోగ్యానికి సంజీవని.. తమలపాకు.. రోజూ తింటే ఈ రోగాలన్నీ మటుమాయం..

Benefits of Betel Leaves: ఆధునిక ప్రపంచంలో అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారం ప్రభావితం చేస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకూ..

Betel Leaf: ఆరోగ్యానికి సంజీవని.. తమలపాకు.. రోజూ తింటే ఈ రోగాలన్నీ మటుమాయం..
Benefits of Betel Leaves
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 07, 2021 | 4:47 PM

Benefits of Betel Leaves: ఆధునిక ప్రపంచంలో అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారం ప్రభావితం చేస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకూ కూడా మనం వాటిపై దృష్టి సారించడంలేదు. కానీ కొన్ని సమస్యలను మన ఇంట్లోనే పరిష్కారం చూపే ఔషధాలు ఉన్నా.. చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అలాంటి ఔషధాల్లో తమలపాకులు ఒకటి. వీటిల్లో కాల్షియం, ఇనుము, విటమిన్‌ సీ, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఆకలి నుంచి.. అరుగుదల వరకు.. అనారోగ్య సమస్యలకు ఈ తమలపాకులు సంజీవనిలా ఉపయోగపడతాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

ఆకలి కోసం.. ఆకలి అనిపించనప్పుడు.. నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆకలి వేయకపోతే రెండు తమలపాకులు నమిలితే చాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

కడుపు ఉబ్బరం.. కడుపు ఉబ్బరంగా ఉంటే.. రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి వాటిని పాలలో కలుపుకుని తాగితే బ్లోటింగ్ సమస్య చిటికలో తగ్గిపోతుంది. ఇలాచేస్తే.. వెంటనే ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు.

మైగ్రెన్‌, తలనొప్పికి దివ్య ఔషధం.. : తలనొప్పికి కానీ మైగ్రైన్ కి కానీ తమలపాకులు దివ్య ఔషధంలా పని చేస్తాయి. తరచూ ఋ సమస్య వేధిస్తుంటే.. నుదుటి మీద తమలపాకులను రాయడం కానీ.. లేకపోతే.. తమలపాకుల రసంతో కాసేపు మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది.

డిప్రెషన్ నుంచి ఉపశమనం.. ప్రతిరోజూ తమలపాకులు తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అలానే డిప్రెషన్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

జీర్ణ ప్రక్రియకు.. అరుగుదలకు తమలపాకు మేలు చేస్తుంది. జీర్ణప్రక్రియలో అరుగుదలకు సహకరించే యాసిడ్స్ ను ఉత్పత్తి చేయడానికి తమలపాకు సహకరిస్తుంది.

నొప్పులకు.. ఎప్పుడైనా చిన్న గాయాలు కానీ వాపు, నొప్పి కలిగితే తమలపాకులని నొప్పి ఉన్న చోట ఉంచాలి. వీటి రసంతో మసాజ్‌ చేస్తే నొప్పులు కూడా తగ్గుతాయి.

దగ్గు, జలుబు.. తమలపాకులు తినడం వల్ల కఫం రాదు. రోజూ తమలపాకులను తినడం ద్వారా దగ్గు, జలుబు సమస్యలకు కళ్లెం వేయవచ్చు.

Also Read:

Type 2 Diabetes: వ్యాయామంతో టైప్‌ 2 డయబెటిస్‌కు చెక్‌.. పరిశోధనలో వెల్లడి..

మీరు కంటినిండా నిద్రపోతున్నారా..! లేదంటే మీ శరీరం గుళ్లగా మారిపోతుంది.. సుఖమైన నిద్ర కోసం ఇలా చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!